హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి ఏంటంటే…
జీతం తీసుకునే ఉద్యోగులు, స్వయం ఉపాధి ఉన్నవారు.. ఇద్దరూ హోమ్ లోన్ పొందొచ్చు. అయితే లోన్ తిరిగి చెల్లించగలిగే స్థాయిలో శాలరీ, ఆదాయం ఉండాలి.
సాధారణంగా లోన్ తీసుకునేవారి వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. స్థిరమైన ఆదాయం కలిగివుండాలి.
హోమ్ లోన్ కావాలంటే మంచి క్రెడిట్ స్కోర్ (CIBIL Score) ముఖ్యం… అంటే క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. కనీసం 750 సిబిల్ స్కోర్ ఉంటే, బ్యాంకులు లోన్‌ను సులభంగా ఇస్తాయి.
మీ నెల జీతంలో దాదాపు 40% వరకు EMI ఉండేలా చూసుకోవాలి. నెలనెలా వచ్చే శాలరీ, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకునే బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తుంటారు.
కొన్ని బ్యాంకుల్లో భారత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. మీ అర్హతను చెక్ చేసుకుని అప్లై చేయడం మంచిది.