మినీ ఆఫ్రికా నుండి ట్విన్ విలేజ్ వరకు ... భారతదేశంలో టాప్ 5 వింత గ్రామాలు

Published : Feb 06, 2026, 12:46 PM IST

5 Unique Villages in India : భారతదేశంలో వింతలు విడ్డూరాలకు కొదవలేదు. ఇలా సాధారణంగా కాకుండా అసాధారణ జీవనశైలి కలిగిన ప్రజలున్న టాప్ 5 గ్రామాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
భారతదేశంలో వింత గ్రామాలు...

Unusual Communities in India : భారత్ ను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా చెబుతుంటారు... ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు వేరయినా అందరూ భరతమాత బిడ్డలే. అయితే దేశవ్యాప్తంగా ఒక్కోప్రాంతం ప్రజలు జీవనవిధానం ఒక్కోలా ఉంటుంది... కానీ కొందరు మాత్రం ఆయా ప్రాంతాల్లోని సాధారణ ప్రజలకంటే భిన్నంగా, ప్రత్యేకతలు కలిగివుంటారు. ఇలా సాధారణంగా కాకుండా అసాధారణ జీవన విధానం కలిగిన 5 ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

26
1. మట్టూరు, కర్ణాటక

సంస్కృతం అనేది భారతీయ ప్రాచీన భాష. దీనిని కేవలం పూజలు, ఇతర మతపరమైన కార్యకలాపాల సమయంలో మంత్రాల కోసం మాత్రమే ప్రస్తుతం వాడుతుంటారు. ఈ భాష సామాన్యులకు అర్థమయ్యేది కాదు... కొందరు పండితులు, పూజారులకు మాత్రమే అర్థమవుతుంది... ఇది వాడుక భాష కాదు.

అయితే కర్ణాటకలోని ఈ మట్టూరు గ్రామంలో మాత్రం సంస్కృతమే వాడుక భాష. ఇక్కడి ప్రజలందరికీ ఈ భాష వచ్చు... స్థానిక కన్నడ కాకుండా దీన్ని వాడుక భాషగా ఉపయోగిస్తారు. ఇలా మన ప్రాచీన భాషకు ఈ గ్రామం జీవం పోస్తోంది... ఇక్కడికి వెళితే తప్పకుండా సంస్కృతం వచ్చివుండాలన్నమాట.

36
2. ఖోనోమా, నాగాలాండ్

సాధారణంగా వ్యాపారం అంటే డబ్బులు సంపాధించడమే. కానీ ఈశాన్య రాష్ట్రాల్లోని నాగాలాండ్ లో ఓ మారుమూల గ్రామప్రజలు వ్యాపారానికి మరో అర్థం చెబుతున్నారు. ఖోనోమా గ్రామంలో వ్యాపారమంటే నమ్మకం. ఒకరినొకరు నమ్మి ఇక్కడ వ్యాపారాలు జరుగుతుంటాయి.

ఈ ఖోనోమా గ్రామంలో ఎవరైన తమ దగ్గరున్న వస్తువులు అమ్ముకోవాలంటే వాటిని ఓ స్థలంలో పెట్టి వెళ్ళిపోతారు. ప్రజలకు అవి అవసరమైతే తీసుకుని డబ్బులు పెట్టి వెళ్లిపోతారు. ఇది అక్కడి ప్రజలకు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.

46
3. జంబూరు, గుజరాత్

ఈ గ్రామాన్ని మినీ ఆఫ్రికా అనికూడా అంటారు. ఇక్కడ దశాబ్దాల క్రితం ఈస్ట్ ఆఫ్రికా నుండి వలసవచ్చిన ప్రజలు నివాసం ఉంటున్నారు. కాబట్టి ఇక్కడివారు ఆఫ్రికన్ రూట్స్ కలిగివుండి గుజరాతి పద్దతిలో జీవనం సాగిస్తుంటారు. జంబూరుకు వెళితే ఆఫ్రికాలో ఉన్నామా అన్న ఫీల్ కలుగుతుంది.

56
4. మయాంగ్, అస్సాం

అస్సాం రాష్ట్రం మోరిగావ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం మయాంగ్... బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది. ఈ గ్రామం తాంత్రిక పూజలకు బాగా ఫేమస్.. ఎంతలా అంటే ఇప్పటికీ ఈ గ్రామంలో అడ్డుపెట్టాలంటే చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు జంకుతుంటారు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కు సంబంధించి ఓ మ్యూజియమే ఉంది... 2002 లో దీన్ని ప్రారంభించారు. ఇందులో తంత్ర పూజలకు సంబంధించిన పుస్తకాలు, పురావస్తు అవశేషాలు, కళాఖండాలు ఉన్నాయి.

66
5. కొడిన్హి, కేరళ

ఇది ప్రపంచంలోనే కవలల భర్త్ రేట్ ఎక్కువగా ఉన్న ప్రాంతం... దీన్ని 'ట్విన్ విలేజ్ ఆఫ్ ఇండియా' గా చెబుతుంటారు. ఈ కొడిన్హి గ్రామం మలప్పురం జిల్లాలో ఉంది. ఇక్కడ 2 జనాభా ఉంటే 400 నుండి 450 మంది కవలలే. ఇది ప్రపంచ సగటు కంటే 6 రెట్లు అధికం. అయితే ఇక్కడ ఈ స్థాయిలో కవలలు జన్మించడానికి గల కారణమేంటో శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోలేకపోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories