Army village: మనదేశానికి వేలాది మంది సైనికులను అందిస్తున్న ‘ఆర్మీ గ్రామం’.. ప్రతి ఇంట్లో ఓ జవాన్

Published : Nov 08, 2026, 10:23 AM IST

Army village: మనదేశం అతి పెద్దది. దీన్ని కాపాడాలంటే లక్షల్లో సైనికులు అవసరం. ఒక చిన్నగ్రామం ఏటా ఎంతో మంది సైనికులను భారత్ కు అందిస్తోంది. ఆ గ్రామం నుంచి ఇప్పటికీ వేలాదిమంది ఇండియన్ ఆర్మీలో చేరారు. అందుకే ఈ ఊరిని ఆర్మీ విలేజ్ అంటారు.

PREV
13
ఆర్మీ విలేజ్ అని ఏ గ్రామాన్ని పిలుస్తారు?

భారత్‌లో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనే యువత ఎంతోమంది ఉన్నారు. అయితే ఓ గ్రామంలో మాత్రం సైన్యంలో చేరడం తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయంలా మారింది. ఆ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒకరైనా సైన్యంలో పనిచేసినవారు లేదా పనిచేస్తున్నవారు ఉంటారు. దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడేందుకు తమ బిడ్డలను పంపుతూ ఆ గ్రామ ప్రజలు గర్వపడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో గహ్మర్ (Gahmar) అనే గ్రామం ఉంది. దీన్ని ఆర్మీ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గ్రామాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గహ్మర్‌లో సుమారు 1.5 లక్షల మంది నివసిస్తున్నారు. 1530లో రాజా ధామ్‌దేవ్ రావు ఈ గ్రామాన్ని స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది.

23
పదివేల మంది సైన్యంలోనే..

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే ఈ గ్రామం నుంచి 228 మంది సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. వారిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి సైన్యంలో చేరే వారి సంఖ్య తరతరాలుగా పెరుగుతూ వచ్చింది. ఈ గ్రామం నుంచి ఇప్పటివరకు వేలాది మంది భారత సైన్యంలో పనిచేశారు. కొన్ని నివేదికల ప్రకారం ప్రస్తుతం దాదాపు 10 వేల మంది సైనికులు వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందిస్తున్నారు. మరో 5 వేల మందికి పైగా మాజీ సైనికులు గ్రామంలో ఉన్నారు. లెఫ్టినెంట్ నుంచి బ్రిగేడియర్ స్థాయి వరకు ఎదిగిన వారు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. యువతకు సైన్యంలో చేరేందుకు శిక్షణ ఇచ్చే మైదానాలు, మాజీ సైనికులు నిర్వహించే శిక్షణ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పటి నుంచే పిల్లలకు దేశభక్తి భావనను అలవాటు చేస్తారు. తాత సైన్యంలో పనిచేస్తే, కొడుకు లేదా మనవడు కూడా అదే బాటలో నడవాలని ఆశపడతారు.

33
గ్రామాల్లో స్మారక స్థూపాలు

గహ్మర్ గ్రామంలో సైనికుల సేవలను గుర్తు చేసేందుకు ప్రత్యేక స్మారక స్థూపం కూడా ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల పేర్లు ఇందులో కనిపస్తాయి. గ్రామంలో 22 చిన్న ప్రాంతాలు ఉండగా, వాటిలో కొన్ని సైనికుల పేర్లతో గుర్తింపు పొందాయి. ఇక్కడి యువత శారీరక వ్యాయామం చేస్తూ సైనిక నియామకాల కోసం సిద్ధమవుతుంటారు. సైన్యంలో పనిచేయడం ఉద్యోగం మాత్రమే కాదు, దేశానికి సేవ చేసే గొప్ప అవకాశమని గ్రామ ప్రజలు భావిస్తారు. అందుకే తరతరాలుగా ఈ గ్రామం భారత సైన్యానికి వీర జవాన్లను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories