Oldest River: హిమాలయాల కంటే ముందే పుట్టిన నది..మన దేశంలో అత్యంత పాత నది ఇదే..!

Published : Nov 13, 2026, 10:24 AM IST

Oldest River: మన దేశంలో చాలా నదులు ఉన్నాయి. కానీ, హిమాలయాల కంటే ముందే ఏర్పడిన నది ఒకటి ఉందని తెలుసా? కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే ఏర్పడిన ఆ నదిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

PREV
13
డైనోసర్ల కాలం నాటి నది..

భారత దేశంలో అత్యంత పవిత్రమైన, ప్రాచీనమైన నది అనగానే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గంగా నది. అంతేకాదు, మన దేశంలో పురాతన నది ఏది అనగానే చాలా మంది గంగా నది పేరే చెబుతారు. కానీ, గంగా, యమునా కన్నా కూడా పురాతన నది కూడా ఒకటి ఉంది. మరి, ఆ నది ఏంటి? డైనోసార్ల కాలం నుంచి, హిమాలయాల కంటే ముందు నుంచే ఉన్న అత్యంత పురాతన నది ఏంటో ఇప్పుడు చూద్దాం...

గంగానది 5 కోట్ల సంవత్సరాల నాటిది అయితే... 16కోట్ల ఏళ్ల క్రితం మన భూభాగంలో ఉద్భవించిన నది నర్మదా. గంగా నది కంటే కూడా మూడు రెట్లు ఎక్కువ పూరాతనమైనది కావడం విశేషం. మరీ ముఖ్యంగా, హిమాలయాలు ఏర్పడటానికి ముందే ఈ నది ఏర్పడింది.

23
ఈ నది ఎలా ఏర్పడింది..?

భూమి పొరల్లో జరిగిన భౌగోళిక కదలికల వల్ల రెండు కొండల మధ్య భూమి కుంగిపోయి ఏర్పడిన లోయ లో నర్మదా నది ప్రవహిస్తుంది. అయితే.. మిగిలిన నదులన్నీ తూర్పు వైపు ప్రవహిస్తే... ఈ నది మాత్రం పడమర వైపు ప్రవహిస్తుంది. చాలా పెద్ద నదులు సముద్రంలో కలిసే ముందు డెల్టాను ఏర్పరుస్తాయి. కానీ నర్మద అలా కాకుండా నేరుగా 'గల్ఫ్ ఆఫ్ ఖంభాత్' ద్వారా అరేబియా సముద్రంలో కలుస్తుంది.

మధ్యప్రదేశ్‌లోని అమరకంటక్ పీఠభూమిలో పుట్టిన నర్మద, ప్రధానంగా మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల గుండా దాదాపు 1,312 కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్‌లోని భరూచ్ వద్ద సముద్రంలో కలుస్తుంది. పడమర వైపు ప్రవహించే నదుల్లో ఇది అతిపెద్దది, అలాగే దేశంలో ఐదవ అతిపెద్ద నది కూడా ఇదే కావడం విశేషం.

33
డైనోసార్ల కాలం నాటి నది...

నర్మదా నది అత్యంత పురాతనమైనదనడానికి అక్కడ దొరికిన చారిత్రక ఆధారాలే నిదర్శనం.1828లో విలియం స్లీమన్ అనే అధికారి జబల్‌పూర్ సమీపంలో భారతదేశపు మొట్టమొదటి డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు. 1982లో క్రీటేషియస్ కాలానికి చెందిన 'రాజాసారస్ నర్మదెన్సిస్' అనే డైనోసార్ శిలాజాలు ఇక్కడే బయటపడటం గమనార్హం. ఈ నర్మదా నదిలోనే అత్యంత ప్రాచీన మానవ శిలాజం కూడా లభించింది. అందుకే.. ఈ నదిని అత్యంత ప్రాచీన నదిగా చెబుతుంటారు.

పూజలు అందుకునే నది..

కేవలం భౌగోళికంగానే కాకుండా, హిందూ సంప్రదాయంలోనూ నర్మదా నదికి విశేష స్థానం ఉంది. దీనిని సాక్షాత్తూ దేవతగా కొలుస్తారు, పురాణాల్లో దీనిని 'రేవా' (Reva) అని కూడా పిలుస్తారు. ఆది శంకరాచార్యులు తన గురువును కూడా ఇక్కడే కలుసుకున్నారు అని నమ్ముతారు.

Read more Photos on
click me!

Recommended Stories