జపాన్ లో జ్వరం వస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా.. అస్సలు ఊహించలేరు, అది లేకపోతే మోతే

Published : Nov 13, 2026, 07:32 AM IST

జపాన్ లో ఆరోగ్య వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. జపాన్ ప్రభుత్వం అక్కడి ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అలాంటి జపాన్ లో సాధారణ జ్వరం వస్తే ఎంత ఖర్చుతుందో తెలుసా ?

PREV
15
జపాన్ లో జ్వరం వస్తే ?

అభివృద్ధి చెందిన అగ్ర దేశాలలో జపాన్ ఒకటి. అక్కడ ప్రజల క్రమశిక్షణ, ప్రతి రంగంలో ప్రభుత్వ నిబంధనలు చాలా కట్టుదిట్టంగా ఉంటాయి. జపాన్ ప్రజల ఆరోగ్యంపై ఆ దేశం చాలా శ్రద్ద వహిస్తుంది. అక్కడ ప్రతిఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాంటి జపాన్ లో జ్వరం వస్తే ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతోందో ఎప్పుడైనా ఆలోచించారా ? ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

25
చిన్న క్లినిక్ అయినా అపాయింట్మెంట్ తప్పనిసరి

సాధారణంగా జపాన్ లో జ్వరం వచ్చినప్పుడు ఓ చిన్న క్లినిక్ కి వెళ్ళాలి అన్నా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ టైంకి ఆసుపత్రికి వెళ్ళాలి. ఇండియాలో ఆధార్ కార్డు ఉన్నట్లే జపాన్ లో ప్రతి ఒక్కరికీ మై నంబర్ కార్డు ఉంటుంది. దానిని తీసుకుని వెళ్లి ఆసుపత్రిలో స్కాన్ చేయాలి.

35
జ్వరం వస్తే అయ్యే ఖర్చు ఇదే

మన టైం వచ్చినప్పుడు డాక్టర్ పిలుస్తారు. అవసరమైతే పరీక్షలు చేస్తారు. నార్మల్ జ్వరమే అయితే ప్రిస్క్రిప్షన్ రాసి పంపుతారు. డాక్టర్ ఫీజు 2000 యెన్ ల వరకు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 1200. మెడిసిన్ కి మరో 1000 యెన్ లు అవుతుంది. అంటే 600 రూపాయలు. ఇలా మొత్తంగా సాధారణ జ్వరం వస్తే జపాన్ లో 2000 రూపాయల వరకు ఖర్చవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇంకా తగ్గుతుంది.

45
ఇన్సూరెన్స్ లేకపోతే మోతే

జపాన్ ఆరోగ్య వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది, కానీ అది మనం అనుకున్నదానికంటే భిన్నంగా పనిచేస్తుంది. సరైన సమాచారం లేకపోతే ఖర్చులు, చికిత్స మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు జపాన్ కి టూరిస్ట్ గా వెళితే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఉత్తమం. ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుంటే సాధారణ జ్వరానికి కూడా ఆసుపత్రిని బట్టి రూ 4000 వరకు ఖర్చవుతుంది. జపాన్‌లో ఇన్సూరెన్స్ లేకుండా చికిత్స తీసుకోవడం చాలా ఖరీదైనది. జపాన్‌లో నివసించే ప్రతి ఒక్కరికీ (టూరిస్టులకు కాకుండా) నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ (NHI) తప్పనిసరి. ఈ ఇన్సూరెన్స్ ఉంటే, మొత్తం ఖర్చులో 30% మాత్రమే రోగి చెల్లించాలి.

55
టెస్టులకు అదనపు ఫీజులు

జపాన్‌లో పెద్ద ఆసుపత్రులకు నేరుగా వెళ్లడం మంచిది కాదు. సాధారణ జ్వరానికి స్థానిక క్లినిక్‌లకు (Local Clinics) వెళ్లడం చాలా ముఖ్యం. పెద్ద ఆసుపత్రులకు రిఫరల్ లెటర్ లేకుండా వెళ్తే, అదనపు ఫీజులు (సుమారు ₹3,000 - ₹4,000) చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు టెస్టులు అవసరం అయితే ఈ ఖర్చు 8000 అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories