Top 5 Temples : మీరు దేవున్ని నమ్ముతారా? అయితే జీవితంలో తప్పక చూడాల్సిన 5 దేవాలయాలు ఇవే

Published : Nov 12, 2026, 02:20 PM IST

ఇండియాలో వేలాది దేవాలయాలు ఉన్నాయి… కానీ కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకతను కలిగివున్నాయి. ఇలాంటి ఆలయాలను జీవితంలో ఒక్కసారయినా చూడాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి 5 ఆలయాలు ఇవే..

PREV
15
తప్పక సందర్శించాల్సిన ఐదు దేవాలయాలు

Top 5 Temples in India : ఏ మతం అయినా ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఉందని చెబుతుంది... దీన్ని హిందువులు దేవుడని, ముస్లింలు అల్లా అని, క్రైస్తవులు క్రీస్తు అని నమ్ముతారు. అందుకే ప్రార్థించే పద్దతులు వేరయినా అన్నిమతాల్లో దైవారాధన ఉంటుంది.అంతేకాదు ప్రతి మతం జీవితంలో ఒక్కసారయినా సందర్శించాల్సిన పవిత్ర ప్రాంతాల గురించి చెబుతుంది... ఇలా ముస్లింలకు మక్కా, క్రైస్తవులకు జెరూసలెం ఉన్నాయి.

అయితే హిందువులకు మాత్రం ఇండియాలోనే అనేక ఆలయాలు ఉన్నాయి... ముఖ్యంగా బ్రతికుండగా ఒక్కసారయినా కాశీ విశ్వనాథుడికి దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ ఒక్కటే కాదు దేవున్ని నమ్మే ప్రతిఒక్కరు చనిపోయేలోపు తప్పక చూడాల్సిన మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి... వాటిలో టాప్ 5 దేవాలయాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏమిటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

25
1. వెంకటేశ్వరస్వామి ఆలయం, తిరుమల

ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ ఆలయం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం. కలియుగంలో ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వరస్వామి అవతారంలో తిరుమల ఏడుకొండలపై కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారని నమ్ముతారు... అందుకే ఆ స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా భావిస్తారు. నిత్యం లక్షలాదిమంది శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు... హుండీ ఆదాయం కోట్లల్లో ఉంటుంది.

కొందరు భక్తులు వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకుంటారు. ఎంతో శ్రమించి కాలినడకన కొండపైకి చేరుకుంటారు... శ్రీవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి వుంటారు... కొన్నిసార్లు కంపార్ట్ మెంట్స్ లో రెండుమూడు రోజులు కూడా వెయిట్ చేయాల్సి రావచ్చు. కానీ గర్భగుడిలోకి ప్రవేశించి ఆ స్వామి దివ్యమంగళ రూపాన్ని చూడగానే అప్పటివరకు పడిన కష్టాలన్నీ మరిచిపోతారు... దర్శనం కొన్నిసెకన్లే అయినా ఆ రూపం కళ్లలో నిలిచిపోతుంది. మళ్లీ స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అనిపిస్తుంటుంది. అందుకే హిందువుగా పుట్టిన ప్రతిఒక్కరు జీవితంలో ఒక్కసారయినా తిరుమలను సందర్శించాలని పెద్దలు చెబుతుంటారు.

35
2. కేదార్ నాథ్, ఉత్తరాఖండ్

దేవభూమి ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాల్లోని హిమాలయ పర్వతశ్రేణుల్లో కేదార్ నాథ్ ఆలయం ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 3583 కిలోమీటర్ల ఎత్తులో, మంచు పర్వతాల మధ్య కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఎంతో చరిత్ర కలిగిన మహిమాన్విత ఆలయమిది. కేదార్ నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి... ఇక్కడ శివలింగం త్రిభుజాకారంలో అంటే గోమాత మూపురం ఆకారంలో ఉంటుంది.

ఈ కేదార్ నాథ్ ఆలయానికి చేరుకోవడం అంత ఈజీ కాదు.. కఠిన వాతావరణ పరిస్థితులను, కొండలను దాటుకుంటూ కిలోమీటర్లకొద్ది నడవాల్సి ఉంటుంది. కొందరు ఈ పరిస్థితులను తట్టుకోలేక వెనక్కి వెళ్లిపోదాం అనుకుంటారు. కానీ ఎలాగోలా ఆలయానికి చేరుకుని లింగరూపంలోని కేదారనాథున్ని దర్శించుకోగానే ఇవన్ని మర్చిపోతారు.

45
3. కామాఖ్య ఆలయం, అస్సాం

భారతదేశంలోని అత్యంత విశిష్ఠత కలిగిన ఈ కామాఖ్య ఆలయం అస్సాంలోని నీలాచల్ కొండల్లో ఉంది... 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం విగ్రహం ఉండదు... యోని ఆకారంలో ఉండే రూపాన్ని పూజిస్తారు. ఇక్కడ అమ్మవారికి రుతుస్రావం అవుతుందని కూడా నమ్ముతారు. ఈ ఆలయం తాంత్రిక సాధనకు ప్రసిద్ది చెందింది.

4. చిదంబరం ఆలయం, తమిళనాడు

తమిళనాడులో అనేక ఆలయాలు ఉన్నాయి... వాటిలో ఈ చిదంబర ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ నటరాజస్వామి కొలువై ఉన్నాడు... ఆసక్తికర విషయం ఏమిటంటే గర్భగుడిలో ఎలాంటి విగ్రహం ఉండదు. కేవలం బంగారు బిల్వపుష్పాలను శూన్యానికి అలంకరించి ఉంటాయి.

దేవుడు ''ఇందుగలడందులేడని సందేహము వలదు... ఎందెందు వెదకి చూచిన అందందే గలడు'' అన్నదానికి ఈ ఆయలమే ప్రత్యక్ష నిదర్శనం. నిరాకార స్వరూపంలో శివుడు దర్శనం ఇస్తాడు. శూన్యంలో దేవుడిని చూసుకుంటాం కాబట్టి 'చిదంబర రహస్యం' అనే నానుడి పుట్టింది.

55
4. ఐరావతేశ్వర ఆలయం, కుంభకోణం

తమిళనాడులోని మరో ప్రసిద్ద ఆలయం ఈ ఐరావతేశ్వరం.. ఇది కుంభకోణం సమీపంలోని దారాసురంలో ఉంది. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది... అందుకే ఇది 'గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్' గా ప్రసిద్ది చెందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆ ఆలయ ప్రదాన మండపం రథం అకారంలో ఉంటుంది... దీనిని ఏనుగులు లాగుతున్నట్లు ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోని కొన్ని రాళ్లను తడితే సప్తస్వరాలు అంటే సంగీత శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు.

Read more Photos on
click me!

Recommended Stories