Vande Bharat Prices: మనదేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవ్వబోతోంది. జనవరి 22 నుంచి ఇది తన సేవలను ప్రారంభిస్తోంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైలు 16 ఏసీ కోచ్‌లతో నడుస్తుంది. దీని టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మనదేశంలో నడుస్తున్న అత్యాధునిక రైలు వందే భారత్. దేశీయ టెక్నాలజీతో సిద్ధమైన సెమీ హైస్పీడు రైలు ఇది. ఈ రైలు తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం నడుస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వందేభారత్ రైలును తయారుచేశారు. సాధారణ రైళ్లతో పోలిస్తే దీని వేగం, సౌకర్యాలు ఎక్కువ. భద్రతలో కూడా ఇది ముందుంటుంది. మొన్నటి కేవలం కూర్చునే వందేభారత్ రైలులో ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవ్వబోతోంది. జనవరి 22 నుంచి కామాఖ్య - హౌరా మార్గంలో ఈ రైలు నడుస్తుంది. రాత్రి ప్రయాణాన్ని వేగంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ కొత్త సెమీ-హై-స్పీడ్ రైలును నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నడుపుతుంది.
24
హౌరా కామాఖ్య వందే భారత్
మొదటి వందే భారత్ స్లీపర్ రైలు 27576 నెంబరుతో కామాఖ్య నుంచి హౌరాకు వెళుతుంది. దీని తిరుగు ప్రయాణం 27575 హౌరా నుంచి కామాఖ్య వరకు సాగుతుంది. కామాఖ్య - హౌరా రైలు బుధవారం తప్ప, హౌరా - కామాఖ్య రైలు గురువారం తప్ప మిగతా రోజుల్లో నడుస్తుంది.
వందేభారత్ రైలు పూర్తిగా ఎలక్ట్రిక్ సిస్టమ్ తో నడుస్తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఆటోమేటిక్ డోర్లు, విశాలమైన ఖాళీ స్థలం, ఎల్ ఈడీ లైటింగ్, వైఫై సదుపాయం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లలో బయో టాయిలెట్లను ఏర్పాటుచేశారు. ముఖ్యంగా శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థ, ఫైర్ సేఫ్టీ సెన్సార్లు ఉన్నాయి. ఈ రైలులో కుదుపులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీరి ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
34
ఎన్ని స్టేషన్లలో ఆగుతుంది?
ఈ రైలు హౌరా నుంచి కామాఖ్యకు వెళ్లేటప్పుడు మధ్యలో 13 స్టేషన్లలో ఆగుతుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాలకు ఇది ముఖ్యమైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ స్లీపర్ రైలు మాత్రం ఇదొక్కటే. ఇంకా మరిన్ని స్లీపర్ రైళ్లు భవిష్యత్తులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రయాణ సమయం తగ్గడంతో వ్యాపారం, పర్యాటక రంగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఆధునిక సాంకేతికతతో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే వందేభారత్ రైలు... భారత రైల్వేకు గర్వకారణంగా మారింది.
రైలు 27575 హౌరా నుంచి సాయంత్రం 6:20కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:20కి కామాఖ్య చేరుకుంటుంది. రైలు 27576 కామాఖ్య నుంచి సాయంత్రం 6:15కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:15కి హౌరా చేరుకుంటుంది. మొత్తం ప్రయాణ సమయం సుమారు 14 గంటలు.
ఈ స్లీపర్ వందే భారత్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. ఇందులో 11 కోచులు ఏసీ 3-టైర్, 4 కోచుులు ఏసీ 2-టైర్, 1 కోచ్… ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉన్నాయి. థర్డ్ ఏసీకి రూ.2,300, సెకండ్ ఏసీకి రూ.3,000, ఫస్ట్ ఏసీకి రూ.3,600 చెల్లించాల్సి ఉంటుంది.