Motivation: చిన్న చీమ‌లు పెద్ద సందేశం.. వీటిలా జీవిస్తే లైఫ్‌లో తిరుగే ఉండ‌దు

Published : Jan 20, 2026, 04:54 PM IST

Motivation: సృష్టిలో ఎన్నో జీవులు ఉంటాయి. ఒక్కో జీవి జీవ‌న విధానం ఒక్కోలా ఉంటుంది. అయితే కొన్ని జీవుల జీవన విధానం మ‌న‌కు ఎంతో సందేశాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో చీమ‌లు ఒక‌టి. చీమ‌ల నుంచి మ‌నం ఏం నేర్చుకోవాలో చూద్దాం. 

PREV
15
అహర్నిశలు కష్టపడే స్వభావం

చీమలు రోజంతా ఆగకుండా పని చేస్తుంటాయి. అలసట అనేది వాటి జీవితంలో కనిపించదు. వర్షాకాలం రాకముందే ఆహారం నిల్వ చేసుకుంటాయి. భవిష్యత్తు గురించి ముందే ఆలోచించే లక్షణం చీమల్లో స్పష్టంగా ఉంటుంది.

మనకు పాఠం: ఈరోజు చేసిన కష్టం రేపటి భద్రతగా మారుతుంది. ఆలస్యం లేకుండా పని చేస్తే జీవితం సాఫీగా సాగుతుంది.

25
క్రమశిక్షణతో కూడిన జీవనం

చీమల్లో ప్రతి చీమకు ఒక బాధ్యత ఉంటుంది. వేటి ప‌ని అవి చేస్తాయి. ఎలాంటి గందరగోళం ఉండదు. నాయకత్వం, అనుసరణ రెండూ సమతుల్యంగా కనిపిస్తాయి.

మనకు పాఠం: జీవితంలో క్రమశిక్షణ ఉంటే లక్ష్యాలు సులభంగా చేరుతాయి. బాధ్యతను గౌరవించడం విజయంలో కీలకం.

35
ఐక్యతలో అపార శక్తి

ఒక్క చీమను వేరుగా చూస్తే బలహీనంగా కనిపిస్తుంది. కానీ అనేక చీమలు కలిస్తే పెద్ద ఆహారాన్ని కూడా మోసుకెళ్లగలవు. ప్రమాదం వచ్చినప్పుడు చీల‌న్నీ ఒకటిగా స్పందిస్తాయి.

మనకు పాఠం: ఒంటరిగా సాధించలేని విషయాలు ఐక్యతతో సాధ్యమవుతాయి. కుటుంబం, బృందం, సమాజం విలువను అర్థం చేసుకోవాలి.

45
సహనం, పట్టుదల

చీమ ఎదురైన అడ్డంకితో ఆగిపోదు. మార్గం మూసుకుపోతే మరో దారి వెతుకుతుంది. పడిపోయినా మళ్లీ లేచి ముందుకు సాగుతుంది.

మనకు పాఠం: విఫలతలు తాత్కాలికం. సహనం ఉన్నవాడే చివరకు గమ్యాన్ని చేరతాడు.

55
అహంకారం లేని జీవితం

చీమ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రదర్శన ఉండదు. గర్వం కనిపించదు. అవసరమైనంత మాత్రమే తింటుంది.

మనకు పాఠం: సాదాసీదా జీవితం మనసుకు శాంతిని ఇస్తుంది. అహంకారం లేకుండా పనిచేస్తే గౌరవం సహజంగా వస్తుంది..

మొత్తం మీద చీమ జీవితం మనకు ఒక నిశ్శబ్ద పాఠం. చిన్నదిగా కనిపించే ఈ జీవి మనకు పెద్ద జీవన సూత్రాలు నేర్పుతుంది. కష్టం, క్రమం, ఐక్యత, సహనం, వినయం… ఇవన్నీ చీమల నుంచి నేర్చుకుంటే జీవితం బలంగా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories