Parrots: మీ ఇంట్లో పెంచుతున్న చిలుకలు ఆడవో, మగవో ఇలా సింపుల్ గా తెలుసుకోండి

Published : Sep 11, 2026, 12:55 PM IST

Parrots: మీ ఇంట్లో ఉన్న చిలుకలను చూడండి.. అవి ఆడవో, మగవో మీరు పోల్చుకోగలరా? చాలా కష్టం కదా. కానీ కొన్ని అంశాలను పరిశీలిస్తే ఆడ, మగ చిలుకలను పోల్చేయచ్చు. ఆ అంశాల గురించి ఇక్కడ చెప్పాము.

PREV
13
చిలుకల జెండర్ ఎలా తెలుసుకోవాలి?

చిలుకలను ఇళ్లలో పెంచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే తమ వద్ద ఉన్నది మగ చిలుకా? ఆడ చిలుకా? అనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని చిలుక జాతుల్లో బయటికి కనిపించే కొన్ని లక్షణాలను బట్టి మగ, ఆడ చిలుకలను కొంతవరకు గుర్తించవచ్చు. ముఖ్యంగా చిలుక వయసు పెరిగే కొద్దీ కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముక్కు చుట్టూ ఉండే భాగం రంగు, శరీర ఆకారం, ఈకల రంగు, ప్రవర్తన వంటి విషయాలను గమనిస్తే అవి ఆడవో, మగవో తెలుసుకోవచ్చు. అయితే ఈ లక్షణాలు అన్ని రకాల చిలుకలకు ఒకేలా ఉండవు. అందుకే కేవలం ఒక్క లక్షణాన్ని చూసి లింగాన్ని నిర్ణయించడం సరైనది కాదు.

23
చిలుకల్లో చూడాల్సిన లక్షణాలు

మగ చిలుకల్లో కొన్ని జాతులకు చెందిన వాటి ముక్కు చుట్టూ ఉండే భాగం ముదురు రంగులో ఉంటుంది. ఆడ చిలుకల్లో అదే భాగం కొంత లేతగా ఉండటం లేదా వేరే రంగులోకి మారడం కనిపిస్తుంది. అలాగే కొన్ని చిలుక జాతుల్లో మగ పక్షులు కొంచెం సన్నగా, పొడవైన శరీరంతో ఉంటాయి. ఆడ పక్షులు కాస్త బలమైన శరీరంతో కనిపించవచ్చు. ఈకల రంగులో కూడా స్వల్ప తేడాలు ఉండొచ్చు. వాటి ప్రవర్తనను బట్టి కూడా ఆడా, మగా అంచనా వేయచ్చు. కొన్ని మగ చిలుకలు ఎక్కువగా శబ్దం చేయడం, మనుషులతో ఎక్కువగా కలిసిపోవడం కనిపిస్తుంది. ఆడ చిలుకలు గూడు ఏర్పాటు చేయడం, వస్తువులను ఒకచోట చేర్చడం వంటి ప్రవర్తన చూపిస్తాయి. అయితే ఒక్కో చిలుక జాతి స్వభావం ఒక్కోలా ఉంటుంది.

33
డీఎన్ఏ పరీక్షతో తేలిపోతుంది

మీ చిలుక లింగాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే డీఎన్‌ఏ పరీక్ష చేయించడం మంచిది. ముఖ్యంగా బయటికి ఎలాంటి తేడాలు కనిపించని చిలుక జాతుల్లో ఇది ఉపయోగపడుతుంది. చిలుక నుంచి తీసిన చిన్న ఈక లేదా రక్త నమూనాతో ఈ పరీక్ష చేయవచ్చు. పరీక్ష ద్వారా మగదా, ఆడదా అనే విషయం స్పష్టంగా తెలుసుకోవచ్చు. చిలుకను కొనుగోలు చేసేటప్పుడు లేదా పెంపకం కోసం జంటను ఎంపిక చేసేటప్పుడు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం లేదా డీఎన్‌ఏ పరీక్ష చేయించడం అత్యంత నమ్మకమైన మార్గం.

Read more Photos on
click me!

Recommended Stories