Water cut Iron: ఇనుమును చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఆ ఇనుమును కూడా నీరు కట్ చేయగలదని మీకు తెలుసా? ఇది ఆశ్చర్యకరమైనదే అయిన ఇది నిజం. ఇనుమును నీరు ముక్కలు చేసే శక్తిని కలిగి ఉంది.
నీటితో ఇనుమును కట్ చేయగలరా? అని అడిగితే చాలామంది వెంటనే నో అనే చెబుతారు. ఎందుకంటే మనం సాధారణంగా నీటిని మృదువైన పదార్థం.. అది గట్టి ఇనుమును ఎలా కట్ చేస్తుంది? ఇలా ఆలోచించి ఎంతో మంది నీటితో గట్టి ఇనుమును కోయడం అసాధ్యమని అంటారు. కానీ నిజానికి నీటికున్న శక్తి చాలా ఎక్కువ. సరైన పద్ధతిలో వాడితే నీటితో ఇనుమును కట్ చేయవచ్చు. ప్రత్యేకమైన యంత్రాల సాయంతో నీటిని అత్యంత అధిక ఒత్తిడితో, చాలా వేగంగా పంపితే ఇనుము, స్టీల్ వంటి గట్టి లోహాలను కూడా కట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీని వాటర్‌జెట్ కటింగ్ అంటారు. పరిశ్రమల్లో లోహాలను అవసరమైన ఆకారంలో కచ్చితంగా కోయడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.
23
ఎలా కట్ చేస్తుంది?
నీరు ఇనుమును కట్ చేసేందుకు వాటర్‌జెట్ కటింగ్ వాడతారు. ఇందులో నీటిని భారీ ఒత్తిడికి గురిచేస్తారు. ఆ తర్వాత దాన్ని చాలా చిన్న రంధ్రం ఉన్న నాజిల్ నుంచి బయటకు పంపిస్తారు. రంధ్రం చాలా చిన్నగా ఉండటంతో నీరు అత్యంత వేగంతో సన్నని ధారగా బయటకు దూసుకొస్తుంది. ఈ ధార లోహంపై బలంగా తాకినప్పుడు దాని ఉపరితలంలోని చిన్న చిన్న కణాలను తొలగిస్తుంది. అదే ప్రాంతంలో నిరంతరం నీటి ధార పడుతుండటంతో క్రమంగా కోత ఏర్పడి లోహం రెండు భాగాలుగా విడిపోతుంది. అయితే చాలా గట్టి ఇనుము లేదా స్టీల్‌ను కోయాల్సి వచ్చినప్పుడు నీటితో పాటు గార్నెట్ వంటి గట్టి రేణువులను కలుపుతారు. ఈ రేణువులు లోహాన్ని రుద్దుతూ తొలగించడంతో కట్టింగ్ మరింత వేగంగా, ప్రభావవంతంగా జరుగుతుంది.
33
ఇంట్లో కష్టం
నీరు.. ఇనుమును కట్ చేస్తుంది కాబట్టి ఇంట్లో చేద్దాం అనుకోకండి. ఇంట్లో ట్యాప్ నుంచి వచ్చే సాధారణ నీటితో ఇనుమును కట్ చేయడం సాధ్యం కాదు. అత్యంత అధిక ఒత్తిడి, భారీ వేగం, ప్రత్యేక నాజిల్, అవసరాన్ని బట్టి అబ్రేసివ్ రేణువులు ఉన్న ప్రత్యేక యంత్రం మాత్రమే ఈ పని చేయగలదు. ఈ పద్ధతికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇనుమును కత్తి, రంపం లేదా ఇతర యంత్రాలతో కోసేటప్పుడు వేడి ఎక్కువగా ఉత్పత్తి కావచ్చు. కానీ వాటర్‌జెట్ కటింగ్‌లో నీరు చల్లదనాన్ని అందించడం వల్ల వేడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆటోమొబైల్ తయారీ, విమానాల తయారీ, భారీ యంత్రాల తయారీ, లోహాల తయారీ వంటి రంగాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.