Color Changing Birds: ఊసరవెల్లి మాత్రమే కాదు కొన్ని పక్షులు కూడా తమ రంగులను మార్చుకుంటాయి. ప్రకృతిలో మనుగడ కోసం, శత్రువుల నుండి తప్పించుకోవడానికి, జోడీని ఆకర్షించడానికి రంగులు మార్చే 5 అద్భుతమైన పక్షుల గురించిన ఆసక్తికరమైన విశేషాలు మీకోసం.
ప్రకృతి అంటేనే ఒక పెద్ద మిస్టరీ. ఇక్కడ బతకాలి అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. శత్రువుల కంటికి పడకుండా తప్పించుకోవాలి. లేదంటే వేరే జంతువులకు ఆహారం అయిపోవాల్సిందే. రంగులు మార్చడంలో మనం ఎక్కువగా ఊసరవెల్లి గురించి మాట్లాడుకుంటాం. కానీ, మన పక్షుల్లో కూడా కొన్ని కిలేడీలు ఉన్నాయి.
ఇవి సీజన్‌ను బట్టి, అవసరాన్ని బట్టి తమ ఈకల రంగులను మార్చేస్తాయి. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, తమ భాగస్వామిని ఆకర్షించడానికి ఇవి చేసే ఈ కలర్ ఛేంజ్ ట్రిక్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఇలా రంగులు మార్చి అందరినీ ఆశ్చర్యపరిచే 5 వింత పక్షుల గురించిన వివరాలు గమనిస్తే..
27
1. విల్లో ప్టార్మిగన్
ఈ విల్లో ప్టార్మిగన్ పక్షి సీజనల్ క్యామోఫ్లేజ్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే పరిసరాలకు తగ్గట్టుగా రంగులు మారుతుంది. ఇవి ఎక్కువగా ఆర్కిటిక్, సబ్-ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ పక్షి ఎండకాలంలో బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. అదే చలికాలం రాగానే మంచు కురుస్తుంది కదా, అప్పుడు ఇది పూర్తిగా ప్యూర్ వైట్ కలర్‌లోకి మారిపోతుంది. దీనివల్ల మంచులో ఇది ఎక్కడుందో శత్రువులకు అస్సలు దొరకదు. మళ్లీ మంచు కరిగిపోయాక, టండ్రా ప్రాంతానికి తగ్గట్టుగా బ్రౌన్ కలర్ ఈకలు వచ్చేస్తాయి. బతికేందుకు ఇది చేసే ఈ ఛేంజ్ నిజంగా సూపర్ కదా.
37
2. స్నో బంటింగ్
ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే మరో క్రేజీ పక్షి స్నో బంటింగ్. ఇది కూడా సీజన్‌ను బట్టి కలర్స్ మారుస్తుంది. బ్రీడింగ్ సీజన్ అంటే జతకట్టే సమయంలో, మగ పక్షులు వైట్ కలర్‌లో ఉంటూ అక్కడక్కడ బ్లాక్ కలర్ షేడ్స్‌తో కనిపిస్తాయి. ఇలా ఉండటం వల్ల ఆడ పక్షులను ఈజీగా ఆకర్షించవచ్చు. ఇక బ్రీడింగ్ సీజన్ అయిపోగానే, వీటి ఈకలు బ్రౌన్ కలర్‌లోకి మారిపోతాయి. కొండలు, రాళ్ల మధ్య ఈజీగా కలిసిపోవడానికి ఈ రంగు వీటికి బాగా హెల్ప్ అవుతుంది.
అమెరికన్ గోల్డ్‌ఫించ్ పక్షి చేసే కలర్ ట్రాన్స్‌ఫార్మేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎండకాలంలో మగ పక్షులు మంచి బ్రైట్ ఎల్లో కలర్‌లో మెరిసిపోతాయి. తలపై బ్లాక్ కలర్ క్యాప్ లాగా ఉంటుంది. మేటింగ్ సీజన్‌లో ఆడ పక్షుల అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఈ లుక్ వీటికి బాగా ఉపయోగపడుతుంది. కానీ చలికాలం వచ్చేసరికి, ఇవి ఓలివ్ బ్రౌన్ షేడ్‌లోకి మారిపోతాయి. ఈ డల్ కలర్ వల్ల అవి చుట్టుపక్కల చెట్లలో కలిసిపోయి, శత్రువుల కంటికి పడకుండా సేఫ్‌గా ఉంటాయి.
57
4. రాక్ ప్టార్మిగన్
విల్లో ప్టార్మిగన్ జాతికి చెందిన ఈ రాక్ ప్టార్మిగన్ పక్షి ఏడాదిలో చాలాసార్లు రంగులు మారుస్తుంది. ఇది చలికాలంలో వైట్ కలర్‌లో, ఎండకాలంలో మచ్చల బ్రౌన్ కలర్‌లో కనిపిస్తుంది. అంతేకాదు, వసంతకాలం, శరదృతువు సీజన్లలో ఇటు బ్రౌన్ కాకుండా, అటు వైట్ కాకుండా ప్యాచీ లుక్‌లోకి మారిపోతుంది. వాతావరణంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఇవి నిరంతరం రంగులు మారుస్తూ, ఏడాది పొడవునా డేంజర్ నుంచి తప్పించుకుంటాయి.
67
5. స్కార్లెట్ టానగర్
స్కార్లెట్ టానగర్ పక్షి కథ కొంచెం వేరేలా ఉంటుంది. బ్రీడింగ్ సీజన్‌లో మగ పక్షులు హాట్ రెడ్ కలర్‌లో ఉండి, వాటి రెక్కలు బ్లాక్ కలర్‌లో ఉంటాయి. ఈ బ్రైట్ కలర్ వల్ల ఆడ పక్షులు వీటికి ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. అయితే, సీజన్ అయిపోయిన వెంటనే ఇవి గ్రీన్ అండ్ ఎల్లో మిక్సింగ్ కలర్‌లోకి మారిపోతాయి. చూడటానికి సేమ్ ఆడ పక్షుల్లాగే తయారవుతాయి. ఇక ఎవరినీ ఆకర్షించాల్సిన అవసరం లేదు కాబట్టి, దట్టమైన చెట్ల పొదల్లో దాక్కోవడానికి ఈ గ్రీన్ కలర్ వీటికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
77
పక్షులు రంగులు ఎందుకు మారుస్తాయి?
పక్షుల్లో ఈకల రంగు మారడాన్ని మౌల్టింగ్ అంటారు. అంటే పాత ఈకలు రాలిపోయి, వాటి స్థానంలో కొత్త ఈకలు రావడం ఒక సహజమైన ప్రక్రియ. పక్షులు రంగులు మార్చడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి క్యామోఫ్లేజ్, అంటే చుట్టుపక్కల పరిసరాల్లో కలిసిపోయి శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవడం. రెండు మేటింగ్ డిస్‌ప్లే, అంటే బ్రీడింగ్ సీజన్‌లో పార్ట్‌నర్‌ను అట్రాక్ట్ చేయడం. కొన్ని పక్షులలో పగటి వెలుతురు, ఉష్ణోగ్రత ఆధారంగా జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఈ కలర్ షిఫ్ట్ జరుగుతుంది.