Salary: అమెరికాలో బాత్రూములు కడిగితే లక్షల్లో శాలరీ.. కోటీశ్వరులు అయిపోవచ్చా? నెలకు ఎంత వస్తుందంటే?

Published : Aug 06, 2026, 12:10 PM IST

Salary: అమెరికాలో బాత్రూములు కడిగితే లక్షల్లో జీతం వస్తుందా? కోటీశ్వరులు అవుతారా? యూఎస్ లో లేబర్ వర్క్ చేసేవారి జీతం ఎంత ఉంటుంది? ఖర్చులు ఎలా ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?

PREV
15
అమెరికాలో బాత్రూమ్ క్లీన్ చేసేవారు ఎంత సంపాదిస్తారు?

అమెరికా (USA) లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, డాక్టర్ల జీతాల గురించే కాకుండా, డెలివరీ బాయ్స్, బాత్రూమ్స్ లేదా బిల్డింగ్ క్లీనర్స్ వంటి బ్లూ కాలర్ (Blue Collar) వర్కర్స్ ఆదాయాల గురించి కూడా తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అమెరికన్స్ తో పాటు ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి క్లీనింగ్ పనులు చేసేవారు నెలకు ఎంత సంపాదిస్తారు? వారి సంపాదన లక్షల్లో ఉంటుంది. వారి ఖర్చులు పోను ఎంత మిగులుతుంది? అనే విషయాలను అధికారిక డేటాతో పాటు యూట్యూబర్ల (YouTubers) సమాచారం ప్రకారం వివరాలు చూద్దాం.

25
గంటల లెక్కన చెల్లింపులు ఉంటాయి.

అమెరికా కార్మిక శాఖ (U.S. BLS) అమెరికన్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం అమెరికాలో క్లీనింగ్ సెక్షన్స్ లో పనిచేసేవారికి గంటల లెక్కన శాలరీ ఉంటుంది. సగటున గంటకు $15.00 నుండి $18.00 డాలర్లు అంటే 1800 వరకూ వారికి పే చేస్తారు. రెండు గంటలకు లేదా పని స్వభావాన్ని బట్టి ఇది మారుతుంది. ఇక ఏడాదికి వారి ఆదాయం అందాజుగా సగటున $40,000 డాలర్లు. అంటే దాదాపుగా 40 లక్షల వరకూ ఉంటుంది. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండదు కొంత మందిలో పెరగొచ్చు తగ్గొచ్చు.

35
నైట్ షిఫ్టులు / ఆఫీస్ క్లీనింగ్

అమెరికాలో వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, హోటళ్లలో రాత్రివేళల్లో పని చేసేవారికి గంటకు $20 డాలర్ల వరకు వేతనం లభిస్తుంది.సాధారణంగా అమెరికాలో 'బాత్రూమ్స్ క్లీనింగ్' అని ప్రత్యేకంగా ఉండదు. దాన్ని "జెనిటోరియల్ సేవల" (Janitorial & Building Cleaning Services) పరిధిలో ఒక భాగంగా చూస్తారు. ఇక కొంత మంది యూట్యూబర్స్ పంచుకున్న వాస్తవ సమాచారం ప్రకారం అమెరికాలో నివసిస్తున్న పలువురు తెలుగు మరియు భారతీయ యూట్యూబర్లు తమ వీడియోలలో బ్లూ కాలర్ ఉద్యోగుల ఆదాయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. వారికి గంటల ప్రాతిపదికన చెల్లింపులు ఉంటాయని చెప్పుకొచ్చారు.

45
రోజుకు ఎంత సంపాదిస్తారంటే?

అమెరికా లో గంటల చొప్పున పనిచేసే వర్కర్స్.. రోజుకు 8 నుండి 10 గంటలు పనిచేస్తే, రోజుకు $120 నుండి $160 డాలర్లు సంపాదించవచ్చు.ఈ లెక్కన నెలకు సంపాదన సుమారు $3,000 నుండి $4,000 డాలర్లు ఉంటుంది. ఇది భారతీయ రూపాయిల్లో దాదాపు ₹3.3 లక్షలు. ఇక డబ్బులు అవసరం ఉన్నవారు ఓవర్‌టైమ్ (Overtime) కూడా చేస్తుంటారు. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే, అదనపు గంటలకు సాధారణ వేతనం కంటే 1.5 రెట్లు (Time and a Half) ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ లెక్కన కొంత మంది నెలకు 5 లక్షలు సంపాదించే అవకాశం కూడా లేకపోలేదు.

55
ఏ పని చేసిన గౌరవిస్తారు..

అమెరికాలో ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, జీవన వ్యయం (Cost of Living) కూడా ఎక్కువే. ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటూ క్లీనింగ్ పని చేస్తున్నట్లయితే నెలకు అయ్యే సగటు ఖర్చుల వివరాలు చూసకుంటే.. ఇంటి అద్దె (Shared Room/Apartment)$500 అంటే దాదాపు 40 నుంచి 50 వేలు. ఇక భోజనం & గ్రాసరీస్ దాదాపు $400 అంటే 30 వేలకు పైగా అవుతాయి. ఇక ప్రయాణ ఖర్చులు (Car Fuel / Public Transport) మొబైల్, వైఫై & హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర వ్యక్తిగత ఖర్చులు మొత్తం లెక్కలు వేసుకుంటే 2 నుంచి 3 లక్షలకు పైనే వస్తుంది. చివరిగా ఎంత మిగులుతుంది అంటే ?ఒక క్లీనింగ్ వర్కర్ నెలకు $3,500 సంపాదిస్తే, పన్నులు (Taxes) మరియు పై తెలిపిన నిత్యవసర ఖర్చులు పోను నెలకు సుమారు 2 లక్షల ఇండియన్ రూపీస్ వరకూ మిగిలే అవకాశం ఉంది. అంటే పక్కాగా ప్లాన్ చేసుకుని, ఓవర్ టైమ్ కూడా చేసుకుంటే.. ఏడాదికి 25 లక్షలు సేవ్ చేసుకోవచ్చు.

అమెరికాలో ఏ పనినీ తక్కువగా చూడరు (Dignity of Labor). బాగా సంపాదించే పెద్ద పెద్ద ఉద్యోగులకు ఎంత గౌరవం ఉంటుందో లేబర్ వర్క్ చేసేవారికి కూడా అంతే గౌరవం ఉంటుంది. స్వయంకృషితో, శ్రమించే తత్వం ఉంటే క్లీనింగ్ పనుల ద్వారా కూడా ప్రణాళికాబద్ధంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories