చరిత్ర చెప్పే ఆసక్తికర కథనాల విషయానికొస్తే ప్రాచీన కాలంలో గారెలు ఉన్నాయి. దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయం ఉంది. గారె మధ్యలో ఉన్న చిల్లు ద్వారా శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మేవారు. అలాగే శివలింగాన్ని సూచించే రూపంగా కూడా గారెను భావించేవారు. గారెలో పెట్టిన చిల్లు ఆధ్యాత్మిక అర్ధాన్ని ఇస్తుందని కొందరు పండితులు అభిప్రాయం. గారే చక్రం ఆకారంలో ఉండటం వల్ల కాలచక్రాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు. గారె మధ్యలో ఉన్న చిల్లు జీవితంలో ఉన్న ఖాళీలను, శూన్యతను సూచిస్తుందని అంటారు. గారె కేవలం ఆహారం మాత్రం కాదు తెలుగు రాష్ట్రాలకు ఒక సంప్రదాయ వంటకంగా మారిపోయింది.
సాంప్రదాయకంగా వడ చేసేటప్పుడు, తడి చేతిపై పిండిని ఉంచి, బొటనవేలితో రంధ్రం చేసి నూనెలో వేస్తారు. ఈ పద్ధతి వల్ల వడ ఆకారం మారదు. వేయించేటప్పుడు గరిటెతో తిప్పడానికి, తీయడానికి ఈ రంధ్రం చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.