సౌదీ అరేబియాలో అబ్బాయిలు ఏ దేశం పడితే ఆ దేశానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు. తమ దేశ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది ఆ ప్రభుత్వం. ఒకవేళ వేరే దేశం అమ్మాయిని చేసుకోవాలంటే, కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
ప్రేమకు దేశం, భాష, ప్రాంతం వంటి హద్దులు ఉండవని అంటారు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం పెళ్లి విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అక్కడి యువకులు ఈ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందే.
సౌదీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అక్కడి అబ్బాయిలు నాలుగు దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు. ఈ రూల్ చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. మన పొరుగు దేశాల్లోని మూడు దేశాలు ఈ లిస్ట్‌లో ఉండటం గమనార్హం.
23
ఈ దేశం అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు
ఆ నిషేధిత దేశాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చాద్. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలైనప్పటికీ, సౌదీ ప్రభుత్వం ఈ నిషేధం విధించింది. విదేశీ మహిళలతో పెళ్లిళ్లను నిరుత్సాహపరచడమే ఈ రూల్ ముఖ్య ఉద్దేశం.
33
ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఒకవేళ సౌదీ అబ్బాయిలు వేరే దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటే, ముందుగా ప్రభుత్వానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. ఈ పర్మిషన్ అధికారిక శాఖల నుంచే పొందాలి. రూల్స్ అతిక్రమిస్తే కఠిన శిక్షలు ఉంటాయి.
ఇప్పటికే పెళ్లైన వారు లేదా విడాకులు తీసుకున్న వారు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే మరిన్ని కఠిన నిబంధనలు పాటించాలి. పెళ్లి అనుమతి కోసం అప్లై చేశాక ఆరు నెలలు ఆగాలి. ఆ తర్వాతే ప్రభుత్వం అన్నీ పరిశీలించి అనుమతి ఇస్తుంది.