భారతదేశం మ్యాప్ చూడండి... ఎన్నో నగరాలు, ప్రాంతాలు ఉన్నాయి. మనదేశంలో సరిగ్గా మధ్యలో ఉండే సిటీ ఏదో తెలుసా? దానికి చాలా ప్రత్యేకత ఉంది. బ్రిటిష్ కాలం నుంచే దీనికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
భారతదేశం చాలా పెద్దది. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన సముద్ర తీరం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దేశం విస్తరించి ఉంది. ఇంత పెద్ద దేశంలో దాదాపు మధ్య ప్రాంతంలో ఉన్న నగరం ఏది అని అడిగితే టక్కున చెప్పగలరా? అది ఇంకేదో కాదు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్. భౌగోళికంగా దేశం మధ్యభాగానికి దగ్గరగా ఉండటం వల్ల నాగ్‌పూర్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అంతేకాదు.. ఈ నగరానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఇక్కడ చారిత్రక జీరో మైల్ స్టోన్ ఉంది. బ్రిటిష్ పాలన కాలంలో దేశంలోని ప్రాంతాల మధ్య దూరాలను లెక్కించేందుకు ఈ ప్రాంతాన్ని ఒక ముఖ్యమైన గుర్తుగా ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది.
23
జీరో మైల్ స్టోన్ అంటే ఏమిటి?
నాగ్‌పూర్‌లో ఉండే జీరో మైల్ స్టోన్ ఎంతో ప్రత్యేకమైనది. ఇది సాధారణంగా కనిపించే ఒక స్తంభంలా ఉన్నా కూడా.. దాని వెనుక చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో దేశంలోని రహదారులు, ప్రాంతాల మధ్య దూరాలను కొలిచేందుకు ఈ ప్రాంతాన్ని ఒక ముఖ్యమైన కేంద్రంగా పరిగణించారు. ఈ గుర్తు దగ్గర నుంచి వివిధ ప్రాంతాలకు ఉన్న దూరాలను లెక్కించే పద్ధతి ఉండేది. అందుకే నాగ్‌పూర్‌కు “భారతదేశం సెంటర్లో ఉన్న నగరం” అనే పేరు బలంగా ఏర్పడింది. జీరో మైల్ స్టోన్ వద్ద ఉన్న స్తంభంతో పాటు నాలుగు గుర్రాల ఆకారాలు కూడా కనిపిస్తాయి. ఇవి ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తాయి.
33
దేశానికి మధ్యలో ఉండటం వల్లే
నాగ్‌పూర్‌కు ఉన్న ప్రత్యేకత జీరో మైల్ స్టోన్ మాత్రమే కాదు. దేశంలోని అనేక ప్రాంతాలకు మధ్యలో ఉండటం వల్ల రవాణా పరంగా కూడా ఈ నగరం చాలా ముఖ్యమైన కేంద్రంగా మారింది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమాన ప్రయాణాలకు కూడా నాగ్‌పూర్ కీలక ప్రాంతం అయింది. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే నగరాల్లో నాగ్‌పూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. నాగ్‌పూర్‌లోని జీరో మైల్ స్టోన్ భారతదేశ భౌగోళిక చరిత్రతో ముడిపడిన ప్రసిద్ధ గుర్తు.