Snake: పాములు కాటేసే ముందు సిగ్నల్స్ ఇస్తాయా? ఇవి తెలుసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు!

Published : Aug 04, 2026, 02:45 PM IST

Snake: పాము కనిపిస్తే చాలు.. కాటేస్తుందేమో అని భయపడే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ పాములు సాధారణంగా ఎవరినీ వెంబడించి కాటేయవంటున్నారు నిపుణులు. మరి పాములు ఎప్పుడు కాటేస్తాయి? కాటేయడానికి ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
పాములు కాటేసే ముందు సిగ్నల్స్ ఇస్తాయా?

పాము పేరు వినగానే చాలామందికి వణుకు పుడుతుంది. ఇక పాము ఎదురుగా కనిపించినప్పుడు ఆ భయం రెట్టింపవుతుంది. నిపుణుల ప్రకారం పాము భయపడినప్పుడు లేదా ముప్పు ఉందని భావించినప్పుడు ఫస్ట్ చేసే పని తప్పించుకోవడానికి ప్రయత్నించడం. సాధారణంగా పాములు మనుషులను చూసి దూరంగా వెళ్లిపోవాలని చూస్తాయి. కానీ వాటికి వెళ్లే దారి లేకపోయినా, వాటిని వెంబడించినా, తాకడానికి ప్రయత్నించినా రక్షణ కోసం కాటేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమయంలో పాము తన శరీర భాష ద్వారా కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవేంటో చూద్దాం.

26
బుసలు కొట్టడం

పాము కాటేయడానికి ముందు ఇచ్చే ముఖ్యమైన సంకేతాల్లో ఒకటి బుసలు కొట్టడం. ప్రమాదం ఉందని అనిపించినప్పుడు కొన్ని పాములు గట్టిగా శబ్దం చేస్తూ వాటి అసహనాన్ని తెలియజేస్తాయి. పాము బుసలు కొడుతున్న సమయంలో దానికి దగ్గరగా వెళ్లడం చాలా ప్రమాదకరం. ఆ సమయంలో పాము తనను తాను రక్షించుకోవడానికి కాటేయవచ్చు.

36
తల పైకి ఎత్తి చూడటం

కొన్ని పాములు ప్రమాదం ఎదురైనప్పుడు తమ శరీరాన్ని చుట్టుకుని, తలను పైకి ఎత్తి కాటేయడానికి సిద్ధంగా ఉన్న స్థితిలోకి వస్తాయి. ఇది పాము అసౌకర్యంగా ఉందని తెలిపే సంకేతం. ముఖ్యంగా తలను పైకి ఎత్తి మన వైపు చూస్తూ ఉండే పామును రెచ్చగొట్టకుండా వెంటనే దూరంగా వెళ్లడం మంచిది.

46
పడగ విప్పడం

నాగుపాము వంటి కొన్ని పాములు ప్రమాదం సమయంలో తమ మెడ భాగాన్ని విస్తరించి పడగ విప్పుతాయి. ఇది వాటి ప్రత్యేకమైన రక్షణ చర్య. పడగ విప్పడం ద్వారా అవి శత్రువును భయపెట్టి దూరంగా పంపించాలని ప్రయత్నిస్తాయి. పడగ విప్పిన పామును చూసినప్పుడు దాని దగ్గరకు వెళ్లి ఫోటోలు తీయడం లేదా పట్టుకోవడం చాలా ప్రమాదకరం.

56
తోకను వేగంగా కదిలించడం

కొన్ని పాములు తోకను వేగంగా కదిలించడం, నేలపై కొట్టడం వంటి ప్రవర్తనను చూపిస్తాయి. ఇది కూడా వాటికి భయం లేదా కోపం వచ్చినప్పుడు కనిపించే సంకేతంగా చెప్తారు. అయితే ప్రతి పాము ఒకే విధంగా హెచ్చరిక ఇవ్వదు. కొన్ని పాములు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వకుండానే కాటేయగలవు కాబట్టి.. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

66
నోరు పెద్దగా తెరవడం

పాము నోరు తెరవడం కూడా ఒక హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పాములు శత్రువును భయపెట్టడానికి నోరును పెద్దగా తెరుస్తాయట. అలాంటి సమయంలో పామును కదిలించడం లేదా దగ్గరకు వెళ్లడం ప్రమాదకరం.

పాము కనిపించినప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు దాన్ని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించడం. కానీ నిపుణుల సూచన ప్రకారం.. పాము కనిపించినప్పుడు దూరంగా నిలబడి, దానికి వెళ్లే మార్గం ఇవ్వడం, అవసరమైతే స్నేక్ రెస్క్యూ సిబ్బంది సహాయం తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories