మనం ఫోన్ వాడుతున్నామా లేక అది మనల్ని వాడేస్తోందా? ఈ మాట వింటే కఠినంగా ఉన్నా, ఇదే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న వాస్తవం..!
“ఫ్రీ” అని మనం ఆసక్తిగా స్వైప్ చేస్తున్న రీల్స్, యాప్స్ వెనుక ఒక పెద్ద ఆట దాగి ఉంది... అదే 'అటెన్షన్ ఎకానమీ'!
మీ కళ్ళు స్క్రీన్‌కు మాత్రమే అతుక్కుపోయి, మెదడు మత్తులో మునిగిపోవడమనేది పెద్ద ఇంటర్నేషనల్ మల్టీ క్రోర్ బిజినెస్.
ఫ్రీ అనే ఎరకి చిక్కిన చేపలు మనం..!
ఫ్రీ యాప్ అంటే... మీ టైం, మీ ఫోకస్, మీ ప్రతీ లైక్ అమ్మకానికి పెట్టడమే..!
టెక్ జెయంట్స్ మన మెదళ్లని హుక్ చేయడానికి కోట్లు పెడుతున్నాయి.
లైక్ వచ్చినా, కొత్త పోస్ట్ కనిపించినా, మన బ్రెయిన్ లో డోపమైన్ అనే కెమికల్ విడుదల అవుతుంది.
అది ఒక చిన్న హై ఇస్తుంది.
లైక్స్, కామెంట్స్ లేక నోటిఫికేషన్ రింగ్ మోగినప్పుడు బ్రెయిన్‌కు కిక్ వచ్చి, అది స్లాట్ మెషీన్ అయిపోతుంది.
“ఇంకో రీల్ లాస్ట్” అని అనుకుంటాం, కానీ అది ఎప్పుడూ ఆగదు.