Published : Jun 20, 2026, 10:44 AM ISTUpdated : Jun 20, 2026, 10:56 AM IST
ఒక్క పామును చూస్తేనే మనకు భయంతో వణుకు పుడుతుంది. అలాంటిది ఒక ఊరిలో వేలకొద్దీ నాగుపాములు పెంచుతున్నారు... ఆ పాములతో వాళ్లు ఏం చేస్తారో తెలుసా? ఈ ఫొటో గ్యాలరీలో ఆ వింత గ్రామం విశేషాల గురించి తెలుసుకుందాం.
వియత్నాంలోని విన్ సన్ గ్రామానికి వెళ్తే ప్రతీ ఇంట్లో పాముల బాక్సులు కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు ఇళ్లలోనే కాదు పొలాల్లోనూ ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటుచేసి పాములను పెంచుతారు. ఈ గ్రామంలో 600కి పైగా కుటుంబాలు నాగుపాములను పెంచుతూనే జీవనోపాధి పొందుతున్నాయి. చాలా ఇళ్లలో 1,000 నుంచి 5,000 వరకు పాములు ఉంటాయి... కొందరయితే పొలాలవద్ద 10,000 పైగా పాములను కూడా పెంచుతున్నారు. గత 200 ఏళ్లుగా ఈ వింత, ప్రమాదకరమైన వ్యాపారం చేస్తున్నారు విన్ సన్ గ్రామస్థులు… అందుకే ఈ ఊరికి 'కోబ్రా విలేజ్' అని పేరు వచ్చింది.
25
పాములతో ఇన్ని కోట్ల బిజినెసా?
కోబ్రా విలేజ్ ప్రజలకు పాములే జీవనాధారం... తరతరాలుగా నాగుపాముల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములను పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. వీళ్లు ప్రధానంగా పాములను మాంసం కోసమే పెంచుతారు... మనం కోడి, మేక మాంసం కొన్నట్లు ఇక్కడ పాము మాంసంకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కొందరు వ్యాపారులు ఈ గ్రామస్థులను పాముల పెంచేలా ప్రోత్సహిస్తున్నారు…వ్యాపారం కోసం లోన్లు కూడా ఇస్తున్నారు.
ఈ విన్ సన్ గ్రామంలో పెంచే పాముల నుండి కేవలం మాంసమే కాదు చర్మం, గుడ్లు, విషం వంటి ఇతర ఉత్పత్తుల కూడా లభిస్తున్నాయి.. వీటిని అమ్మి కూడా గ్రామస్థులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఇలా పాముల వ్యాపారం ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు గ్రామస్థులు. 2024లో విన్ సన్ గ్రామ పాముల వ్యాపారం విలువ 100 బిలియన్ వియత్నామీస్ డాంగ్‌లుగా ఉంది... అంటే సుమారు 4 మిలియన్ డాలర్లు. ఇండియా రూపాయల్లో 37.7 కోట్లు అన్నమాట.
35
హైటెక్ పాముల ఫారంలు
ప్రతీ ఏటా ఇక్కడ లక్షలాది నాగుపాము గుడ్లను ఉత్పత్తి చేస్తారు. వాటిలో చాలా వరకు దేశీయంగా, విదేశాల్లో అమ్ముతారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం ఈ వ్యాపారంపైనే ఆధారపడి ఉంది.
కాలక్రమేణా ఇక్కడి ప్రజలు పాములు పెంచే సంప్రదాయ జ్ఞానానికి ఆధునిక టెక్నాలజీని జోడించారు. ఒకప్పుడు చిన్న స్థాయిలో పాములను పెంచేవారు కానీ ఇప్పుడు చాలా ఫారాలు వాణిజ్యపరంగా నడుస్తున్నాయి. ఈ గ్రామంలో ప్రత్యేకంగా పాముల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. గతంలో వేలల్లో పాములను ఉత్పత్తిచేసే ఈ గ్రామం ఇప్పుడు లక్షల్లో ఉత్పత్తి చేస్తుంది.
వీళ్లు అడవి పాములపై ఆధారపడరు.. ఫారమ్‌లలో పెంచిన పాములతోనే తర్వాతి తరాన్ని ఉత్పత్తి చేస్తారు. ముందుగా ఆరోగ్యకరమైన మగ, ఆడ నాగుపాములను ఎంపిక చేసుకుంటారు. ఆడ నాగుపాములు పెట్టిన గుడ్లను సురక్షితమైన ఉష్ణోగ్రత, తేమలో ఉంచుతారు. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాక, వాటిని వేరువేరు పెట్టెల్లో లేదా సురక్షితమైన పంజరాల్లో ఉంచుతారు.
గతంలో పాములకు ఎలుకలు, కప్పలు అహారంగా పెట్టేవారు… కానీ ఇప్పుడు కోడి మెడలు, ఇతర ఆహారాన్ని ఇస్తున్నారు. తొందరగా పెరిగేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు పాములకు అందించే ఆహారంలో మినరల్ సప్లిమెంట్లను కూడా కలుపుతారు. పాములకు రోజూ కాకుండా, ప్రతి 3-4 రోజులకు ఒకసారి ఆహారం పెడతారు.
55
పాముల పెంపకంతో నష్టాలు..
నాగుపాముల పెంపకం లాభదాయకమే అయినా ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. విషపూరితమైన పాములతో పనిచేయడం చాలా ప్రమాదకరం… కొన్నిసార్లు పాముకాటుకు గురై ప్రాణాలు కూడా పోతాయి. అంతేకాకుండా పాముల నుంచి వ్యాధులు సోకే ప్రమాదం రైతులకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది. ఒక ఫారంలో ఇన్ఫెక్షన్ సోకితే, పెద్ద సంఖ్యలో పాములు చనిపోవచ్చు. ఇది భారీ ఆర్థిక నష్టానికి దారితీస్తుంది.