టాంగ్ హువాన్ తయారీలో గుడ్లను ముందుగా బాగా గిలకొడతారు. ఆ తర్వాత నీళ్లు కలిపి, బ్రెడ్ ఫ్లోర్, కేక్ ఫ్లోర్‌ను సమానంగా తీసుకుని అందులో వేస్తారు. దీనికి కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్, చక్కెర కలుపుతారు. ఈ మిశ్రమాన్ని వడకట్టి పిండిని సిద్ధం చేస్తారు.
ఈ స్వీట్ తయారీకి ప్రత్యేకమైన లోహపు అచ్చులను ఉపయోగిస్తారు. ఆ అచ్చులను ముందుగా పిండిలో ముంచి, ఆ తర్వాత వేడి నూనెలో ఉంచుతారు. కొద్దిసేపటికి అచ్చును మెల్లగా కదిలిస్తే పిండి విడిపోయి గుండ్రటి ఆకారంలో నూనెలో పడుతుంది. అవి బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయిస్తారు. అంతే.. చైనీస్ షుగర్ రింగ్స్ రెడీ.
చైనాలో ఈ స్వీట్‌కు చైనీస్ న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఇళ్లలోనే వీటిని తయారు చేసుకుంటారు. అంతేకాదు, వంటగదిలో చెడు మాటలు మాట్లాడితే అవి షుగర్ రింగ్‌లోకి వెళ్లిపోతాయని, దాని ప్రభావం వచ్చే ఏడాదిపై పడుతుందని ఓ నమ్మకం కూడా ఉంది.