DMart: డీమార్ట్ కు ఎప్పుడు వెళ్తే టైమ్ సేవ్ అవుతుంది? ఏ రోజు వెళ్తే డబ్బులు ఆదా చేసుకోవచ్చో తెలుసా?

Published : Nov 01, 2026, 07:47 AM IST

DMart: మధ్య తరగతి ప్రజల కిరాణా షాపుగా డీమార్ట్ కు పేరుంది. సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించే ఈ స్టోర్.. ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అయితే డీ మార్ట్ కు ఎప్పుడు వెళ్తు టైమ్ సేవ్ అవుతుంది. డీ మార్ట్ లో డబ్బు ఆదా చేయడం ఎలా?

PREV
13
మధ్యతరగతి ప్రజలకు వరం..

నెలవారీ నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి అందరికీ ముందుగా గుర్తువచ్చే పేరు 'డీమార్ట్' (DMart). బియ్యం, పప్పు దినుసులు, వంట నూనెలు మొదలుకుని సబ్బులు, డిటర్జెంట్లు, టూత్‌పేస్ట్‌లు, గృహోపకరణాల వరకు అన్నీ ఒకే చోట లభించడమే కాకుండా, మార్కెట్ ధర కంటే కాస్త తక్కువ ధరకు దొరుకుతుండటంతో వినియోగదారులు ఇక్కడికి వెళ్లేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే, డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని చిన్న మెలకువలు పాటిస్తే మరింత సమయంతో పాటు ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

23
డీమార్ట్ కు ఏ టైమ్ లో వెళ్లడం మంచిది?

డీమార్ట్ స్టోర్లలో ఎప్పుడూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వారాంతాల్లో (Weekend) కుటుంబాలతో కలిసి షాపింగ్‌కు వచ్చేవారి సంఖ్య భారీగా ఉంటుంది. దీనివల్ల కార్టులు దొరకడం కష్టమవడంతో పాటు బిల్లింగ్ కౌంటర్ల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ప్రశాంతంగా, ఎలాంటి తొందరపాటు లేకుండా షాపింగ్ పూర్తి చేసుకోవాలంటే సోమవారం నుంచి గురువారం మధ్య రోజుల్లో వెళ్లడం మంచిది. ముఖ్యంగా ఉదయం స్టోర్ తెరిచిన టైమ్ లో కానీ.. మధ్యాహ్నం వేళల్లో కానీ వెళ్తే.. రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల బిల్లింగ్ కౌంటర్ల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండే ఇబ్బంది తప్పుతుంది.

నెల చివర్లోనే డిస్కౌంట్లు వస్తాయా?

చాలా మందిలో నెల చివరి రోజుల్లోనే డీమార్ట్‌లో ప్రత్యేక ఆఫర్లు లేదా భారీ డిస్కౌంట్లు లభిస్తాయనే అపోహ ఉంటుంది. అయితే ప్రతి నెల ఆఖరి తేదీల్లోనే ప్రత్యేక ధరలు ఉంటాయని చెప్పేందుకు ఎలాంటి అధికారిక నిబంధనలు లేవు. కొన్ని సందర్భాల్లో నిర్దిష్ట బ్రాండ్లపై తగ్గింపులు, ఎక్కువ ప్యాక్‌లపై ఆఫర్లు ఎప్పుడైనా ఉండవచ్చు. కాబట్టి కేవలం నెల చివరి వరకు వేచి ఉండకుండా, మీకు సరుకులు అవసరమైనప్పుడు రేట్లను బేరీజు వేసుకుని కొనుగోలు చేయడం లాభదాయకం.

33
ఎక్కువగా ఉండే ఆఫర్లు ఏంటి?

డీమార్ట్‌లో సాధారణంగానే MRP కంటే తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తులపై 'బై 1 గెట్ 1' (Buy 1 Get 1) లేదా 'బై 4 గెట్ 1 ఫ్రీ' వంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్లు అన్ని వస్తువులకు వర్తించవు. స్టాక్ లభ్యత తో పాటు ప్రాంతాన్ని బట్టి ఆఫర్లు మారుతుంటాయి. స్టోర్‌కు వెళ్లే ముందే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది. అయితే ఆన్‌లైన్ ధరలు వేరుగా, నేరుగా స్టోర్‌లో ఉండే ధరలు వేరుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సరిచూసుకోవడం ఉత్తమం.

డబ్బు ఆదా చేయడానికి పాటించాల్సిన చిట్కాలు

స్టోర్‌లోకి అడుగుపెట్టే ముందే మీకు కావాల్సిన వస్తువుల లిస్ట్ ను కచ్చితంగా తయారు చేసుకోండి. లిస్ట్ లేకుండా వెళితే అవసరం లేని వస్తువులను కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు చూసి కొనే అవకాశం ఉంది. ఇది అనవసర ఖర్చులకు దారితీస్తుంది. భారీ ప్యాక్‌లపై ఎక్కువ డిస్కౌంట్ ఉందని మనకు ఉపయోగపడని వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవ్వకపోగా, కొన్ని రోజులకు అవి పాడైపోయే ప్రమాదం ఉంది.ఎప్పుడూ ఒకే ఖరీదైన బ్రాండ్‌కు పరిమితం కాకుండా, డీమార్ట్ సొంత హౌస్ బ్రాండ్ ఉత్పత్తులను (DMart Brands) పరిశీలించండి. ఇవి తక్కువ ధరలో మంచి నాణ్యతతో లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories