Published : May 24, 2026, 01:59 PM ISTUpdated : May 24, 2026, 02:03 PM IST
Fastest Animals : ప్రపంచంలో భూమి పై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. చిరుత కంటే వేగంగా నీటిలో పరుగెత్తే, నింగిలో ఎగిరే జీవులు కూడా ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన జీవుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Fastest Animals : గాల్లో, నేలపై, నీళ్లలో చిరుత కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే!
ప్రకృతిలో జీవించాలంటే వేగం చాలా అవసరం. వేటాడే జంతువులకైనా, వేటాడబడే జంతువులకైనా స్పీడే ప్రాణాధారం. తమ పరిసర ప్రాంతాలలో ఆధిపత్యాన్ని చెలాయించడానికి కొన్ని జంతువులు అసాధారణమైన వేగంతో దూసుకెళ్తాయి. నేలపై అయినా, గాల్లో అయినా, లేదా నీటిలో అయినా సరే.. ఇవి క్షణాల్లో కనిపించకుండా దూసుకుపోతాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ఆ టాప్ 5 జీవుల వివరాలు గమనిస్తే..
26
నేలపై రారాజు చిరుతపులి
నేలపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుతపులి. ఇది గంటకు 112 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని తక్కువ బరువు ఉండే శరీరం, చాలా ఈజీగా సాగే వెన్నెముక దీనికి ప్లస్ పాయింట్. ఇవి చాలా తక్కువ దూరంలోనే అత్యంత వేగంగా, తుపాను వేగంతో వెళ్తాయి. అందుకే వేటలో వీటికి తిరుగుండదు.
36
ఆకాశంలో సూపర్ సోనిక్ డేగ
గాల్లో ప్రయాణించే జీవుల గురించి మాట్లాడుకుంటే పెరెగ్రిన్ ఫాల్కన్ (డేగా) అన్నింటికంటే ముందుంటుంది. ఇది పైనుంచి కిందికి డైవ్ చేసేటప్పుడు గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకొస్తుంది. ఇది కేవలం పక్షులలోనే కాదు, మొత్తం భూమ్మీద ఉన్న అన్ని జంతువులలోనే అత్యంత వేగవంతమైన జీవిగా రికార్డు సృష్టించింది.
సముద్రపు నీటిలో సేల్ ఫిష్ వేగానికి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే. ఇది నీటిలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదగలదు. దీని స్ట్రీమ్‌లైన్డ్ బాడీ, లోపలికి ముడుచుకునే వెన్ను రెక్క దీనికి బాగా సహాయపడతాయి. ఎలాంటి శ్రమ లేకుండా నీటిని చీల్చుకుంటూ ఇది చాలా ఈజీగా ముందుకు సాగిపోతుంది.
56
సుదూర పరుగుల వీరుడు ప్రాంగ్‌హార్న్ యాంటిలోప్
నార్త్ అమెరికా పచ్చికభూముల్లో కనిపించే ప్రాంగ్‌హార్న్ యాంటిలోప్ సుదూర పరుగుల వీరుడు. ఇది గంటకు 88 కిలోమీటర్ల వేగంతో చాలా ఎక్కువ దూరం అలసిపోకుండా పరిగెత్తగలదు. అందుకే దీనిని ఎండ్యూరెన్స్ స్ప్రింటర్ అని పిలుస్తారు. ఎంత దూరం అయినా సరే ఒకే వేగంతో దూసుకుపోవడం దీని స్పెషాలిటీ.
66
ఫాస్టెస్ట్ క్షీరదం మెక్సికన్ ఫ్రీ-టెయిల్డ్ బ్యాట్
మెక్సికన్ ఫ్రీ-టెయిల్డ్ బ్యాట్ గాల్లో సమాంతరంగా ప్రయాణించడంలో చాలా ఫేమస్. ఈ గబ్బిలం గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గాల్లో ఇంత వేగంగా ఎగరగల ఏకైక క్షీరదం ఇదే. దీని వేగం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.