ఈ పాముల గ్రామం మహారాష్ట్రలో ఉంది. పేరు 'షేత్‌పాల్'. ఇక్కడి స్థానికులకు, పాములకు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం వల్లే ఈ ఊరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఈ షేత్‌పాల్ గ్రామం ఉంది. ఇక్కడి చాలా ఇళ్లలో పాముల కోసం, ముఖ్యంగా నాగుపాముల (Cobra) కోసం ప్రత్యేకంగా ఓ చిన్న గదిని లేదా చోటను కేటాయిస్తారు. ఈ ప్రదేశాన్ని పాములకు సురక్షితమైన నివాసంగా గ్రామస్థులు చెబుతారు. దశాబ్దాలుగా ఇక్కడ మనుషులు, పాములు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నాయి. పాములను దైవాలుగా భావించి ఇక్కడ కొలుస్తారు.