Camel Tears: వేల రూపాయ‌లు ప‌లుకుతోన్న ఒంటె క‌న్నీరు.. వీటితో ఏం చేస్తార‌నేగా మీ సందేహం.

Published : Jul 08, 2025, 04:38 PM IST

ఎన్నో వింత‌లు, విశేషాల‌కు నెలవు మ‌న విశ్వం. జంతువులు, ప్రాంతాలు ఇలా ఎన్నో వింత‌లు ఉన్నాయి. అలాంటి ఒక వింత గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
పాముకాటు ఎంతో ప్ర‌మాద‌క‌రం

ప్రపంచంలో ఎన్నో పాముల జాతులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఇండియాలో కనిపించే కింగ్ కోబ్రా, కామన్ క్రైట్, రస్సెల్ వైపర్ వంటివి అత్యంత విష‌పూరిత‌మైన‌వి. ఒక‌వేళ ఈ పాములు కాటేస్తే, కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పాముకాటు చికిత్సకు విరుగుడులు లభించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వేల మంది మరణిస్తున్నారు.

25
ఒంటె కన్నీళ్లలోనే పాము విషానికి ఔషధం

రాజస్థాన్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ కామెల్ (NRCC) నిర్వహించిన తాజా పరిశోధనలో ఒక ఆశాజనక విషయం బయటపడింది. ఒంటె కన్నీళ్లలో ఉన్న యాంటీబాడీలు పాముల విష ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుందని తేలింది. ఇవి 26 రకాల పాముల విషానికి పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సా-స్కేల్డ్ వైపర్ పాము విషాన్ని ఒంటె కన్నీళ్లతో తగ్గించడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు.

35
మిగతా దేశాల పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయి

ఈ ఫలితాన్ని కేవలం భారతీయ శాస్త్రవేత్తలే కాకుండా, ఇతర దేశాల పరిశోధనలు కూడా సమర్థిస్తున్నాయి. లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్, దుబాయ్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ సంస్థలు చేసిన అధ్యయనాల్లో కూడా ఒంటె కన్నీళ్లలో ఉన్న యాంటీబాడీలు పాముకాటు విషాన్ని నిరోధించగలవని తేలింది. ఇది వైద్య రంగంలో ఒక గేమ్ చేంజ‌ర్‌గా చెబుతున్నారు.

45
ఒంటె కన్నీళ్ల ధర ఎంత?

ఇంతవరకు కేవలం కొన్ని ర‌కాల‌ ఆయుర్వేద మందుల తయారీలో మాత్రమే ఉపయోగపడుతున్న ఒంటె కన్నీళ్లు, ఇప్పుడు పాముకాటుకు ఔషధంగా మార‌నున్నాయి. దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెర‌గ‌నుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఒక మిల్లీ లీటర్ ఒంటె కన్నీళ్ల ధర రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఉండవచ్చు. అయితే ఈ పరిశోధన వెలువడిన తర్వాత ధరలు రూ. 10,000కి పైగా పెరిగే అవకాశం ఉంది.

55
పాము కాటుతో పెరుగుతోన్న మ‌ర‌ణాలు

ప్రతి ఏడాది భారత్‌లో సుమారు 50,000 మంది పాముకాటు వల్ల మరణిస్తున్నారని అంచనా. ఒక‌వేళ ఒంటె క‌న్నీరుతో ప్ర‌యోగాలు పూర్తి స్థాయిలో విజ‌య‌వంత‌మైతే చిన్న గ్రామాల్లోనూ, అతి తక్కువ వ్యయంతో పాముకాటు చికిత్స అందించవచ్చు. 

ముఖ్యంగా విరుగుడు మందులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఒంటె కన్నీళ్ల ఆధారంగా తయారయ్యే ఔషధాలు ఎంతో మంది ప్రాణాలు రక్షించగలవని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories