Ghee Temple: ప్రతి దేవాలయం వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఒక నేపథ్యం ఉంటుంది. ఏ ఆలయ నిర్మాణానికి అయినా సిమెంట్, ఇసుక, రాళ్లు ఉపయోగిస్తారు. కానీ మనదేశంలో ఉన్న ఓ ఆలయ నిర్మాణంలో మాత్రం 40 వేల కిలోల నెయ్యి వాడారంటే నమ్ముతారా? ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది?
సాధారణంగా ఆలయాల నిర్మాణానికి సిమెంట్, ఇసుక, రాళ్లు, సున్నం వంటివి ఉపయోగిస్తారు. కానీ ఒక ఆలయ నిర్మాణంలో ఏకంగా 40 వేల కిలోల నెయ్యిని ఉపయోగించారంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇలాంటి ఓ ప్రత్యేకమైన ఆలయం మన భారతదేశంలోనే ఉంది. అంతేకాదు.. వేసవిలో ఈ ఆలయ గోడల నుంచి నెయ్యి బయటకు వస్తుందని కూడా స్థానికంగా ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? దీని వెనుక ఉన్న కథేంటి?
25
రాజస్థాన్‌లోని వింతైన ఆలయం
ఈ ప్రత్యేకమైన ఆలయం పేరు భండాసర్ జైన దేవాలయం. రాజస్థాన్‌లోని బికనీర్ నగరంలో ఇది ఉంది. సుమారు 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం జైనమతంలోని ఐదో తీర్థంకరుడైన సుమతినాథుడికి అంకితం చేశారు. భండా షా అనే సంపన్న జైన వ్యాపారి ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. అందుకే ఆయన పేరుమీదుగానే దీనికి భండాసర్ ఆలయం అనే పేరు వచ్చింది. ప్రపంచంలో నెయ్యితో కట్టిన ఏకైక దేవాలయం ఇదే.
35
40 వేల కిలోల నెయ్యి ఎందుకు ఉపయోగించారు?
ఈ ఆలయానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం నిర్మాణంలో నెయ్యి వాడకం. ఆలయ నిర్మాణ సమయంలో సుమారు 40 వేల కిలోల నెయ్యిని ఉపయోగించారట. అప్పట్లో బికనీర్ ప్రాంతం ఎడారి వాతావరణంతో ఉండేది. నీటి కొరత కూడా ఎక్కువగా ఉండేది. దీంతో నిర్మాణ పనుల్లో నీటికి బదులుగా నెయ్యిని ఉపయోగించారనేది ఒక ప్రచారం.
మరో కథ ఏంటంటే.. భండా షా ఎంతో పొదుపుగా ఉండేవారట. ఆయన దగ్గర ఉన్న నెయ్యిలో ఓ ఈగ పడితే దాన్ని కూడా వృథా చేయకుండా తొలగించేవారట. ఇది గమనించిన ఓ శిల్పి ఆయనను ఎగతాళి చేశాడని చెబుతారు. దీంతో తన దాతృత్వాన్ని నిరూపించుకోవడానికి భండా షా ఆలయ నిర్మాణానికి భారీ మొత్తంలో నెయ్యి అందించారని మరో ప్రచారం.
ఈ ఆలయం గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆలయ గోడలు, నేల నుంచి నెయ్యి బయటకు వస్తుందని స్థానికులు చెబుతుంటారు. నిర్మాణ సమయంలో ఉపయోగించిన నెయ్యి కారణంగానే ఇలా జరుగుతుందని కొందరు నమ్ముతారు.
ఆలయ నిర్మాణం చూపు తిప్పుకోనివ్వదు
ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎర్ర ఇసుకరాయి, పసుపు రంగు రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది. ఆలయం లోపల గోడలు, స్తంభాలు, పైకప్పులపై అందమైన చిత్రాలు, క్లిష్టమైన శిల్పకళ కనిపిస్తాయి. బంగారు వర్ణం అలంకరణలు, అద్దాల పనితనం నిర్మాణానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.
55
అద్భుతమైన కళాత్మకత
రాజస్థాన్‌కు వెళ్లే పర్యాటకులు బికనీర్‌లోని ఈ ఆలయాన్ని కచ్చితంగా సందర్శిస్తుంటారు. సాధారణ ఆలయాల కంటే భిన్నమైన నిర్మాణ శైలి, అద్భుతమైన కళాత్మకత కారణంగా భండాసర్ జైన దేవాలయం భారతదేశంలోని ప్రత్యేకమైన చారిత్రక కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.