2025 కి గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది.. ఈ ఏడాది అన్ని ఇండస్ట్రీలతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎంతో సాధించింది. ఈ ఏడాది తమ నటనతోె మెస్మరైజ్ చేసి.. బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?
2025 సంవత్సరాన్ని చూస్తే, ఈసారి భారతీయ సినిమాలో పెద్ద పెద్ద మార్పులు కనిపించాయి. చాలా మంది నటులకు మంచి బ్రేక్ వచ్చింది. విక్కీ కౌశల్, రణ్‌వీర్ సింగ్, రష్మిక మందన్న లాంటి నటులు అద్భుతమైన నటనను కనబరిచారు. ఛావా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో రష్మికకు ఈ ఏడాది చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఛావాలో తన పాత్రను అద్భుతంగాా పోషించింది. ది గర్ల్‌ఫ్రెండ్‌లో ఆమె మరో కొత్త కోణాన్ని చూపించింది. ఈ రెండు పాత్రలు రష్మిక ఎంత కాన్ఫిడెంట్‌గా మారిందో చూపించాయి.
27
కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి
2025 సంవత్సరంలో కొంతమంది నటులు అద్భుతమైన నటనతో ఈ ఏడాదిని తమదిగా చేసుకున్నారు. సినిమా తర్వాత కూడా వారి నటన గుర్తుండిపోయింది. ఈ ఏడాదిని గుర్తుండిపోయేలా చేసుకున్న నటీనటులలో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటనలో అద్భుతమైన ఉత్సాహం కనిపించింది. తన సంస్కృతి పట్ల ఉన్న మక్కువ కనిపించింది. దీనికోసం శారీరకంగా కూడా చాలా మార్పులు చేర్పులను చేసుకున్నాడు రిషబ్, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రిషబ్ శెట్టిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
37
దే దే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసి.. బాలీవుడ్ చేరింది రకుల్ ప్రీత్ సింగ్. పెళ్లి తరువాత కూడా ఆమె తన నటనను కొనసాగిస్తోంది. ఈ ఈ ఏడాది దే దే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్ అయేషా పాత్రలో అద్భుతమైన ఆకర్షణ, ఆత్మవిశ్వాసం చూపించింది. ఆమె ఈ పాత్రకు కొత్తదనం తెచ్చింది. ఆమె నటన సినిమాకు ప్లస్ అయ్యింది. గుర్తుండిపోయేలా తన పాత్రను పోషించింది.
ధురంధర్ సినిమాతో దుమ్ము లేపాడు రణ్‌వీర్ సింగ్. ఈ సినిమాలో తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటన కనబరిచాడు. ఎనర్జిటిక్ రోల్స్‌కు పేరుగాంచిన రణ్‌వీర్, ఈసారి ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఈ నటన ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
57
'తేరే ఇష్క్ మే'లో కృతి సనన్
తేరే ఇష్క్ మేలో కృతి సనన్ తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రేమ, నిరీక్షణ, హృదయం ముక్కలయ్యే భావనను చాలా సింపుల్‌గా, ప్రశాంతంగా చూపించింది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ఒక కొత్త, పరిణతి చెందిన దశను చూపిస్తుంది.
67
120 బహదూర్‌లో ఫర్హాన్ అక్తర్
120 బహదూర్‌లో ఫర్హాన్ అక్తర్ తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఉన్న అ పాత్రను ఆయన చాలా సహజంగా, నిజాయితీగా ప్రదర్శించాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫర్హాన్ నటన మరింతగా ఆకర్శించింది.
77
ఛావాలో విక్కీ కౌశల్
ఈ ఏడాది విక్కీ కౌశల్ కు కూడా బాగా కలిసి వచ్చింది. ఛావా సినిమా ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది. విక్కీ కౌశల్ నటన ప్రేక్షకులను మొస్మరైజ్ చేసింది. ఈ చారిత్రక పాత్రకు విక్కీ బాగా న్యాయం చేశాడు. ఈ శంబాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ చాలా హోమ్ వర్క్ చేశాడు.నిజాయితీగా తాను పడ్డ కష్ట, అద్భుతమైన నటన ఈ పాత్రను మరింత బలంగా మార్చింది. ఇది విక్కీ కౌశల్ ఉత్తమ నటుడిగా నిలబెట్టింది.