మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్

Published : Dec 18, 2025, 02:39 PM IST

Sai Pallavi : ఒకే రకమైన పాత్రకు రకరకాల హెయిర్‌స్టైల్స్, మేకప్ వేయడం వల్ల ప్రయోజనం లేదని నటి సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మేకప్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

PREV
15
సౌత్ స్టార్ హీరోయిన్ గా సాయి పల్లవి

మలయాళ 'ప్రేమమ్'తో వెండితెరపైకి  అరంగేట్రం చేసి, తెలుగు, తమిళ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, ఇప్పుడు పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది. కథాబలం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న సాయి పల్లవి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించింది. 

25
సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి

సినిమాల్లో మేకప్‌కు దూరంగా ఉంటూ, తన సహజమైన నటన, అందంతో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాత్రకు మాత్రమే ఇంపార్టెన్స్  ఇస్తుందే తప్ప, మేకప్‌కు కాదు. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో చెపుతూ వచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతోంది నేచురల్ బ్యూటీ.

35
సాయి పల్లవి పాన్ ఇండియా సినిమా..

సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సాయి పల్లవి.. బాలీవుడ్ ను కూడా ఆకర్శించింది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న 'రామాయణం' చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబతోంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఆమె నటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

45
మేకప్ పై సాయి పల్లవి కామెంట్స్..

పాత్రలు భిన్నంగా ఉంటే చాలని, ఒకేలాంటి పాత్రకు రకరకాల మేకప్ వేయడం అనవసరం అని సాయి పల్లవి అంటోంది. తన దర్శకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆమె వెల్లడించింది. పాత్ర నటనలో వేరియేషన్ కనిపించాలి కానీ.. మేకప్ వల్ల అది రాకూడదు అని ఆమె అభిప్రాయం. అందుకే సాయి పల్లవి మేకప్ కు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.

55
సాయి పల్లవి రాబోయే సినిమాలు

సాయి పల్లవి చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా.. తన  పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోేతే చేయదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం సాయి  పల్లవి బాలీవుడ్ లో  'రామాయణం'తో పాటు, మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన, 'తలైవర్ 173'లో రజనీకాంత్‌తో కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సాయి పల్లవి. 

Read more Photos on
click me!

Recommended Stories