చిరంజీవి నటించిన ఒక ఇండస్ట్రీ హిట్ చిత్ర కథ ఓ సీనియర్ హీరో సినిమా నుంచి తీసుకున్నారు. ఫ్యామిలీ కథని మాస్ కథగా మార్చేసి తెరకెక్కించడంతో సంచలన విజయం సాధించింది.
కొన్ని సార్లు ఒకే కథతో పలు చిత్రాలు వస్తుంటాయి. కథలో కోర్ పాయింట్ ఒకటే ఉంటుంది. దానిని దర్శకులు డీల్ చేసే విధానం వేరుగా ఉంటుంది. అలా ఒకే కథాంశంతో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయి. గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా అందుకు అతీతం కాదు. చిరంజీవి కెరీర్ లో గొప్ప చిత్రాల జాబితాలో గ్యాంగ్ లీడర్ కూడా ఉంటుంది. గ్యాంగ్ లీడర్ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ షేక్ అయ్యే రికార్డులు సృష్టించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
25
చిరంజీవికి అన్నగా మురళి మోహన్
ఈ చిత్రంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ చిరంజీవికి అన్నయ్య పాత్రలో నటించారు. మురళి మోహన్, చిరంజీవి, శరత్ కుమార్ అన్నదమ్ములుగా నటించారు. మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ కంటే చాలా ఏళ్ళ ముందు అదే కథతో బొమ్మరిల్లు అనే సినిమా వచ్చింది. అందులో హీరో నేనే. ముగ్గురు అన్నదమ్ముల కథ అది. నేను చిన్నవాడిగా నటించాను. ఆ చిత్రాన్ని నిర్మించింది విజయ బాపినీడు గారే.
35
ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన సినిమా
అది కమర్షియల్ అంశాలు లేకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ జోనర్ లో సాగే కథ. అప్పట్లో ఆ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. ఎన్టీఆర్ యమగోలకి పోటీగా విడుదలై దానితో సమానంగా ఆడింది. ఆ చిత్రానికి యమగోల పోటీ అని కూడా అన్నారు అని మురళి మోహన్ తెలిపారు. అదే కథని కమర్షియల్ అంశాలు జోడించి పెద్ద హీరోతో చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విజయ బాపినీడుగారు నమ్మేవారు. నాతో ఒకసారి ఆ ఐడియా గురించి చెప్పారు. ఆ కథని ఇప్పుడు తీస్తే మళ్ళీ ఎవరు చూస్తారు అని అన్నాను. లేదు చిరంజీవితో చేస్తాను ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడు అని అన్నారు.
బొమ్మరిల్లు మూవీలో చిన్న తమ్ముడిగా నటించిన నేను గ్యాంగ్ లీడర్ లో పెద్దన్నయ్యగా నటించాను. నా కెరీర్ బిగినింగ్ లో అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్ గారికి తమ్ముడిగా నటించాను. ఆ సినిమా తర్వాత నన్ను అందరూ ఎన్టీఆర్ తమ్ముడు అని పిలిచేవారు. గ్యాంగ్ లీడర్ తర్వాత బయట ఎక్కడైనా కనిపిస్తే అభిమానులంతా చిరంజీవి అన్నయ్య అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు.
55
చిరంజీవి, మురళి మోహన్ సినిమాలు
మొత్తంగా ఎన్టీఆర్ యమగోల చిత్రానికి చుక్కలు చూపించిన బొమ్మరిల్లు కథ చిరంజీవికి కూడా బాగా ఉపయోగపడింది. ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో మనవూరి పాండవులు అనే చిత్రంలో మురళి మోహన్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.