Rajinikanth, Kannappa movie
మంచు ఫ్యామిలీ హీరోలు హిట్ సినిమాలు చేసి చాలా కాలం అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ట్రోలింగ్ మెటీరియల్స్ అవతున్నారు కాని. మంచి వెయిట్ ఉన్న సినిమాను తీసుకురాలేకపోయారు. అందుకే ఈసారి పట్టుదలతో చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు మంచు హీరోలు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా భాషల్లో కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. మంచు విష్ణు కన్నప్పగా, మోహాన్ బాబు లీడ్ రోల్ చేస్తూ.. నిర్మిస్తున్న సినిమా ఇది.
Also Read: శివాజీ ఇల్లు నాదే, జప్తు చేయడం కుదరదు, ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ ప్రభు పిటిషన్
kannappa teaser
ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలుఉన్నాయి. మంచు విష్ణు సినిమా అంటే పెద్దగా హడావిడి ఉండకపోవు కాని.. ఈసినిమా కోసం అన్ని భాషల నుంచి పెద్ద పెద్ద స్టార్స్ ను తీసుకున్నారు మోహన్ బాబు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేస్తుండగా.. కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో కనిపించింది. ఇక మలయాళం నుంచి మోహన్ లాల్, తమిళం నుంచి శరత్ కుమార్, కన్నడా నుంచి కూడా కొంత మంది స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.
Also Read:సీనియర్ ఎన్టీఆర్ - నాగేశ్వరావు లకు ఎదరుతిరిగిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?
అందరికంటే ముఖ్యంగా పాన్ ఇండియా కవర్ అయ్యేలా ప్రభాస్ ను రంగంలోకి దింపారు మంచు ఫ్యామిలీ. ఈసినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో సందడి చేయబోతున్నాడు. మోహన్ బాబుతో ఉన్న అనుబంధంతో ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా ఈసినిమాలో నటించారని సమాచారం. ఇలా తమ ఇమేజ్ ను నమ్మకోకుండా.. అన్ని భాషల్లో ఈసినిమా మార్కెటింగ్ జరిగేలా ప్లాన్ చేసి కన్నప్పను పర్ఫెక్ట్ గా తయారుచేస్తున్నారు.
Also Read:రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?
mohanlal telugu movie Kannappa Official Teaser 2
దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ కన్నప్ప సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా శివ శివ శంకర్ పాట ఆడియన్స్ లోకి బాగా వెళ్ళింది. ఈసినిమా టీజర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈసినిమాలో అన్ని భాషల నుంచి స్టార్స్ నటిస్తున్నారు.
Also Read:సుహాసిని మణిరత్నం అంత పెద్ద వ్యాధితో బాధపడిందా? రహస్యంగా ఉంచడానికి కారణం ఏంటి?
కాని తమిళం నుంచి శరత్ కుమార్ ను మాత్రమే తీసుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక్క గెస్ట్ రోల్ అయినా ఎందుకు చేయించలేదు అనేది ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మోహన్ బాబు రజినీకాంత్ మంచి ప్రెండ్స్ , ఏరా పోరా అనుకునేంత ప్రెడ్షిప్ వాళ్లకు ఉంది. గతంలో మోహన్ బాబు అడగ్గానే పెద్దరాయుడు సినిమాలో పాపా రాయుడిగా కొన్ని నిమిషాల పాత్రను రజినీకాంత్ చేశారు. మరి కన్నప్పలో ఆయన ఎందుకు నటించలేదు అనేది ప్రశ్న.
vishnu manchu
ఈ ప్రశ్నకు మంచు విష్ణు సమాదానం చెపుతూ.. నాన్న గారు అడిగితే రజినీ అంకుల్ తప్పకుండా నటించేవారు. కాని కన్నప్పలో ఆయన చేయగల పాత్ర ఏది లేదు. ఏదో ఒక చిన్న పాత్ర ఇవ్వడం నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఆయన రేంజ్ పాత్ర ఉంటే చేయించే వాళ్లం అన్నారు. అందుకే సూపర్ స్టార్ కన్నప్ప సినిమాను మిస్ అయ్యారట. ఇక కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది.