director vamsy
Director Vamsy: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉంటుందని, అలాగే దర్శకుడు హీరోయిన్ల మధ్య కూడా ఆ రిలేషన్ ఉంటుందనే రూమర్స్ వినిపిస్తుంటాయి. కలిసి పనిచేసే క్రమంలో ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. దీంతో ఫిజికల్‌గానూ కలుస్తారు.
కొందరు ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తారు. మరికొందరు ఆ సినిమాకే పరిమితం చేస్తారనేది వినిపించే మాట. అయితే చాలా వరకు మేకర్స్ కథ సిట్టింగ్ కోసం విదేశాలకు వెళ్తారు. అక్కడ ఎంజాయ్ చేస్తారు. మంచి కథలను సిద్ధం చేసుకుని వస్తారు.
director vamsy (photo credit IDream)
సీనియర్ దర్శకుడు వంశీ కూడా ఇలా సిట్టింగ్‌లకు వెళ్లేవారట. ఓ సినిమా సమయంలో ఆయన బ్యాంకాక్ వెళ్లారట. అక్కడ జరిగిన ఓ విషయాన్ని పంచుకున్నారు. బ్యాంకాక్‌లో ఆయన ఓ హోటల్‌లో దిగారు. అక్కడ రూమ్‌లోకి వెళ్లగా ఓ రైటర్ చెప్పిన మాటకి షాక్ అయ్యారట. అందులో అంతకు ముందు వచ్చిన దర్శకుడు చేసిన పని బయటపెట్టాడట.
director vamsy
`ఒక హీరోని కలవడానికి కొందరు రైటర్స్ తోపాటు బ్యాంకాక్ వెళ్లాల్సి వచ్చింది. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటర్ ఒక రూమ్ చూపించి, ఈ రూమ్‌లో ఫలానా దర్శకుడు ఒక రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడు. ఆ మాట విన్నాను కాని, అది ఏమాత్రం నచ్చలేదు. దాన్ని తీసుకోలేకపోయాను. నేను ఆ రకం డైరెక్టర్‌ని కాదు.
నాకు హీరోయిన్ల విషయంలోగానీ, అమ్మాయిల విషయంలోగానీ మానసికమైన ప్రేమ మాత్రమే ఉంటుందని, దాన్ని మించి ముందుకు వెళ్లడం జరగదు` అని తెలిపారు దర్శకుడు వంశీ. తనవి అన్ని మానసికమైన సంబంధాలే గానీ, ఫిజికల్‌గా పెట్టుకోను అని చెప్పారు వంశీ.
bhanupriya
దర్శకుడు వంశీకి హీరోయిన్ భానుప్రియతో ఎఫైర్ ఉందనే వార్తలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో `సితార` వంటి పలు సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో భాను ప్రియతో దర్శకుడు వంశీ ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆయన కూడా ఈ విషయాలను పలు ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఇలాంటి కామెంట్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది.
director vamsy
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన వంశీ.. 1982లో `మంచు పల్లకీ` సినిమాతో దర్శకుడిగా మారారు. `సితార` చిత్రంతో తానేంటో నిరూపించుకున్నారు. ఈ చిత్రం జాతీయ అవార్డుని అందుకుంది. `అన్వేషణ`, `ప్రేమించు పెళ్లాడు`, `ఆలాపన`, `లేడీస్ టైలర్`, `మహర్షి`, `చెట్టు కింద ప్లీడర్`, `ఏప్రిల్ 1 విడుదల`, `డిటెక్టీవ్ నారద`, `జోకర్`, `ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు` వంటి చిత్రాలను రూపొందించారు.
హ్యూమర్, సెన్సిబులిటీస్‌ని ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు వంశీ. చివరగా ఆయన `ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్` మూవీని రూపొందించారు. ఇది ఆడలేదు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
read more: ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? సావిత్రి, భానుమతి, జమున కాదు
also read: Mad Square Movie Review: `మ్యాడ్ 2` మూవీ రివ్యూ, రేటింగ్