Anushka Shetty
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. వాటి వల్ల సాధారణ నటీనటులు స్టార్లుగా మారిపోతుంటారు. సౌత్ లో ఒక అగ్ర నటి జీవితంలో కూడా మిరాకిల్ జరిగింది. ఆ నటి ఎవరో కాదు అనుష్క శెట్టి. ఆమె జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ టైంలో అనుష్కకి ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది. అదే అరుంధతి చిత్రం. అసలు ఆ చిత్రంలో తనని ఎందుకు తీసుకున్నారో కూడా అనుష్కకి అప్పట్లో క్లారిటీ లేదట. ఆ టైంకి నేను స్టార్ ని కూడా కాదు. పైగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఆ సమయంలో బాగాలేదు. హీరోయిన్ ఓరియెంట్ చిత్రం కాబట్టి నాకన్నా పెద్ద స్టార్ ని తీసుకుని ఉంటే కాస్త సేఫ్ జోన్ లో ఉండేవారు. అరుంధతి చిత్రంలో నన్ను ఎంపిక చేసింది శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారే.
ఈ అమ్మాయి వద్దు అని ఆయనకు సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. నీ కేమైనా పిచ్చా ఇంత పెద్ద సినిమా తీస్తూ ఆ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నావు. ఆమె గ్లామర్ కి తప్ప నటనకి పనికిరాదు అని చెప్పారట. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నన్ను నమ్మారు. నాపైన ఈ చిత్రం వర్కౌట్ అవుతుంది అని ఆయన భావించారు. అరుంధతి చిత్రం వరకు యాక్టింగ్ గురించి, గ్రాఫిక్స్ గురించి పెద్దగా తెలియదు. విక్రమార్కుడు చిత్రంలో అయితే రాజమౌళి గారు చేసి చూపిస్తే దానిని అదే విధంగా కాపీ కొట్టేదాన్ని. సొంతంగా నటించడం తెలియదు అని అనుష్క పేర్కొంది.
అరుంధతి చిత్రం నుంచి నెమ్మదిగా అన్నీ నేర్చుకున్నట్లు అనుష్క తెలిపింది. అరుంధతి అద్భుతమైన విజయం సాధించింది. స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే నటిగా అనుష్క ఎదిగింది. ఆ తర్వాత కాలంలో రాజమౌళి బాహుబలి చిత్రంలో కూడా అనుష్కకి అవకాశం ఇచ్చారు. బాహుబలి, రుద్రమ దేవి లాంటి చిత్రాలతో అనుష్క సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. నయనతార తర్వాత సౌత్ లో అత్యధిక నెట్ వర్త్ కలిగిన నటి అనుష్క, ఆమె ఆస్తులు ఏకంగా 150 కోట్ల వరకు ఉన్నాయి.