అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? `మగధీర` సినిమా ఇంత పనిచేసిందా?

Allu Arjun-Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి అల్లు అర్జున్‌తో ఇప్పటి వరకు సినిమా ఎందుకు చేయలేదు. దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అనేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 
 

why Rajamouli not movies with allu arjun here shocking reason in telugu arj
rajamouli, allu arjun

Allu Arjun-Rajamouli: రాజమౌళి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తారు. ఒక్కో మూవీకి మూడు నాలుగేళ్లు తీసుకుంటారు. ఆయన నుంచి సినిమాలు రావాలంటే సుమారు నాలుగేళ్లు అయినా వెయిట్‌ చేయాల్సిందే. అయితే తాను చేసే హీరోలు కూడా సెలక్టీవ్‌గానే ఉంటారు.

ఇప్పటి వరకు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రవితేజలతోనే చేశారు. అలాగే నాని, సునీల్‌తో ఒక్కో మూవీ చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైమ్‌ మహేష్‌ బాబుతో మూవీ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. 

why Rajamouli not movies with allu arjun here shocking reason in telugu arj
rajamouli, allu arjun

ఇదిలా ఉంటే, పెద్ద హీరోల్లో అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా చేయలేదు. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్‌ మూవీనే రాలేదు. యంగ్‌ హీరోల్లో పెద్ద హీరోలందరితోనూ చేస్తున్న రాజమౌళి..

అల్లు అర్జున్‌తో సినిమా చేయకపోవడానికి పెద్ద కారణమే ఉందట. బన్నీ తండ్రి అల్లు అరవింద్‌ అని, `మగధీర` మూవీనే దీనికి మెయిన్‌ కారణమని తెలుస్తుంది. మరి ఆ కథేంటో చూద్దాం. 
 


Allu Aravind, Ramcharan

రామ్‌ చరణ్‌ హీరోగా రాజమౌళి `మగధీర` మూవీ చేసిన విషయం తెలిసిందే. దీనికి అల్లు అరవింద్‌ నిర్మాత. ఈ మూవీ రిలీజ్‌ టైమ్‌లో అల్లు అరవింద్‌.. రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడట.

చిరంజీవి కొడుకు కాబట్టి ఈ మూవీ బిజినెస్‌ అయ్యిందని, లేదంటే చాలా కష్టమయ్యేదని, ఈ మూవీకి రాజమౌళి ఎక్కువ బడ్జెట్‌ ఖర్చు పెట్టించారని, అప్పులు చేయాల్సి వచ్చిందని జక్కన్నని తక్కువ చేసిన మాట్లాడారట. దీంతో హర్ట్ అయిన రాజమౌళి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. 

rajamouli, allu arjun

దీని కారణంగానే అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా చేయలేదనే పుకార్‌ ఉంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి నిజంగానే అలా చేశాడా? అనేది తెలియాలి. అయితే దీన్ని అల్లు అర్జున్‌ చాలా సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి రికార్డులను బద్దలు కొట్టాలని డిసైడ్ అయ్యాడట.

అందుకే ఆయన `పుష్ప 2`తో దాన్ని టార్గెట్‌ చేసినట్టు చెబుతుంటారు. అంతేకాదు రాజమౌళి సినిమాలను మించిన కలెక్షన్లని ఇతర డైరెక్టర్లతోనే రాబట్టాలనే లక్ష్యంతో వెళ్తున్నాడని టాక్‌. మున్ముందు భారీ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇకపై రాజమౌళి సినిమాలు, అల్లు అర్జున్‌ సినిమాల మధ్యపోటీ ఉండబోతుందా? బన్నీ ఇదే జోరు కొనసాగిస్తారా? అనేది చూడాలి. 
 

allu arjun

అల్లు అర్జున్‌ `పుష్ప 2` తర్వాత కొంత బ్రేక్‌ తీసుకున్నారు. నెక్ట్స్ ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. దీంతోపాటు త్రివిక్రమ్‌తో కూడా సినిమా ఉంటుంది. ఇది మైథలాజికల్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తుంది. 

read  more: మంచు విష్ణు భార్య విరానిక వద్ద ఉన్న బ్యాగ్‌ కాస్ట్ ఎంతో తెలుసా? ఆమె రేంజ్ ముందు సమంత, రష్మిక కూడా జుజూబీనే

also read: సమంత సీక్రెట్ ఎంగేజ్మెంట్ ? వైరల్ అవుతున్న డైమండ్ రింగ్
 

Latest Videos

vuukle one pixel image
click me!