ప్రముఖ హీరోయిన్ ప్రెవేట్ ఫొటోలు లీక్: సైబర్ క్రైమ్ కలకలం!
బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ వ్యక్తిగత ఫోటోలు ఈమెయిల్ ద్వారా లీక్ అయ్యాయి. స్విట్జర్లాండ్ సర్వర్ నుండి వచ్చిన ఈమెయిల్ పై సైబర్ సెల్ కు ఫిర్యాదు చేసింది, దర్యాప్తు కొనసాగుతోంది.
బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ వ్యక్తిగత ఫోటోలు ఈమెయిల్ ద్వారా లీక్ అయ్యాయి. స్విట్జర్లాండ్ సర్వర్ నుండి వచ్చిన ఈమెయిల్ పై సైబర్ సెల్ కు ఫిర్యాదు చేసింది, దర్యాప్తు కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Crime) పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలను బేస్ చేసుకుని ఈ నేరాలు జరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ(30) సైబర్ క్రైమ్ కు గురి అయ్యానని గుర్తించి కేసు పెట్టింది.
తన పర్శనల్ ఫొటోలతో ఓ ఈమెయిల్ తనకు రావటం గమనించి ఎలర్ట్ అయ్యింది. అవి ఎక్కడ సోషల్ మీడియాకు, రకరకాల సైట్ లకు ఎక్కుతాయనే భయంతో ఉంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడింది.
ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లెక్స్ లో ప్రసారమయిన “స్కేర్డ్ గేమ్స్” ఎంతటి ప్రజాదారణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో నటించిన ఇరాన్ హీరోయిన్ “ఎల్నాజ్ నోరౌజీ” .
ఆమెకు రీసెంట్ గా ఓ ఈ మెయిల్ వచ్చింది. అయితే తను ఎవరో తెలియని వ్యక్తులు నుంచి వచ్చే మెయిల్స్ ని పట్టించుకోనని, కానీ తన పాస్ వర్డ్ నే సబ్జెక్ట్ లైన్ గా పెట్టి పంపటంతో ఓపెన్ చేసానని చెప్పింది. ఆ మెయిల్ లో తన పర్శనల్ ఫొటోలు చాలా ఉన్నాయని, చాలా షాక్ కు గురి అయ్యాయని అంది.
వెంటనే ఎలర్ట్ అయిన ఎల్నాజ్ సైబర్ సెల్ ని సంప్రదించింది. ప్రోపర్ ఇన్విస్టిగేషన్ తర్వాత, ఆ ఈ ఇమెయిల్ స్విట్జర్లాండ్‌లోని సర్వర్ నుండి వచ్చిందని వెల్లడైంది.
అయితే, టీమ్ అసలు ఇలా ఎవరు, ఎందుకు చేసారనే విషయమై సమాచారాన్ని పొందలేకపోయింది.ఇప్పుడు ఎల్నాజ్ కొత్త ఇమెయిల్ ఖాతాను ఉపయోగిస్తున్నప్పటికీ ఆమె మళ్లీ తనకు ఈ కొత్త మెయిల్ కు కూడా అలాంటి మెయిల్ వస్తుందేమో అని భయపడుతోంది.
ఇక ఇరాన్‌కు చెందిన నటి నోరౌజీ.. నటన కంటే ముందు పదేళ్ల పాటు డియోర్, లాకాస్టే, లె కాక్యూ స్పోర్టివ్ లాంటి బ్రాండ్స్‌కు మోడల్‌గా పని చేశారు. పర్షియన్ ట్రెడిషనల్ డ్యాన్స్‌తో పాటు భారత్‌లో కథక్‌ను సైతం ఆమె నేర్చుకున్నారు.