నయనతార
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆమె తన పేరును మార్చుకున్నారు. అప్పటి వరకూ క్రిష్టియన్ గా ఉన్న నయనతార హిందూ మతంలోకి మారిపోయారు. మీడియా కథనాల ప్రకారం, 2011లో నటి నయనతార చెన్నైలోని ఆర్య సమాజ్ ఆలయానికి వెళ్లి హిందూ మతం స్వీకరించారు. తన ఇష్టప్రకారమే ఈ పనిచేశానని.. ఎవరి బలవంతం లేదని ఆమె ఓ సందర్బంలో చెప్పారు.
Also Read: 300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
లేడీ సూపర్ స్టార్ నయనతార
ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ కామెంట్స్ చేశారు నయనతార. ఆమె మాట్లాడుతూ.. అవును, నేను హిందూ, ఇది నా సొంత నిర్ణయం. మనస్పూర్థిగా.. నమ్మకంగా ఈ ప్రక్రియను పూర్తి చేశాను' అని చెప్పారు. నయనతార వాల్టాక్స్ రోడ్డులోని ఆర్య సమాజ్ ఆలయానికి వెళ్లి, 'శుద్ధి కర్మ' అనే వేద శుద్ధి కార్యక్రమంలోని అన్ని ఆచారాలను భక్తి శ్రద్ధలతో పాటించారని ఆర్య సమాజ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఆమె హిందూవుగా మారారు.
Also Read: కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ, ఇంత అవమానానికి కారణం ఏంటంటే..?
నయనతార, ప్రభుదేవ
కొన్ని మీడియా కథనాల ప్రకారం, నయనతార ఈ నిర్ణయం వెనుక ఆమె మాజీ ప్రియుడు నటుడు ప్రభుదేవా ఉన్నారని చెబుతున్నారు. నయనతార ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆయనను పెళ్లి చేసుకోవడానికే నయనతార, క్రైస్తవం నుండి హిందూ మతంలోకి మారారని చెబుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు, పెళ్లికి ముందే వారి బంధం తెగిపోయింది. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత కూడా, నయనతార హిందూ మతాన్ని పాటిస్తున్నారు.
Also Read: నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది,