నాగచైతన్య జోడీగా జాన్వీ కపూర్.. హిట్ ఇచ్చిన దర్శకుడితో చైతూ నెక్ట్స్ సినిమా..

First Published | Oct 31, 2024, 11:29 AM IST

టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతోంది. నందమూరి, మెగా హీరోలతో సినిమాలు చేస్తున్న జాన్వీ.. టైర్ 2 హీరోల సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. 

Janhvi Kapoor

టాలీవుడ్ లో ఫుల్ బిజీ బిజీ అయిపోతోంది జాన్వీ కపూర్. స్టార్ హీరోల సినిమాలతో పాటు టైర్ 2 హీరోల సినిమాల్లో కూడా నటించడానికి సై అంటోంది. ఈక్రమంలో జాన్వీ కపూర్ తో సినిమా అంటూ ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, పేరు వినిపించగా. ఇక ఇప్పుడు తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య పేరు కూడా వినిపిస్తోంది. 

Also Read: కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ
 

ఇప్పటికే దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా సూపర్ హిట్ కొట్టింది. కాని ఈసినిమాలో జాన్వీ పాత్ర పెద్దగా కనిపించలేదు. ఏదో గ్లామర్ డాల్ లా అప్పుడప్పుడు కనిపించి..ఓ డ్యూయెట్ కేపరిమితం అయ్యింది. ఇక నెక్ట్స్ చరణ్ సినిమాలో నటిస్తోంది బ్యూటీ. ఆ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో చూడాలి. 

Also Read: పెళ్లైన హీరోలతో ప్రేమలో పడిన 7 బాలీవుడ్ హీరోయిన్లు


ఇక ఈరెండుసినిమాలు కాకుండా నేచురల్ స్టార్ నాని.. సినిమాలో కూడా జాన్వీని సంప్రదించారట టీమ్. కాని ఆమె చెప్పిన రెమ్యునరేషన్ కు భయపడి వెనక్కి తగ్గారట. ఇక తాజాగా నాగచైతన్య చేయబోయే ఓ సింపుల్ లవ్ స్టోరీకి జాన్వీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈసినిమా చేయబోయేది కూడా చైతు లక్కీ దర్శకుడితోనే. 

Also Read: రొమాన్స్ కు రెడీ అవుతున్న మోక్షజ్ఞ, బాలయ్య కొడుకు మామూలోడు కాదు

అక్కినేని యువ కెరటం నాగ చైతన్య ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోతున్నాడు. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న చైతూకు. ఇప్పటికే కెరీర్ లో ఏ మాయ చేశావే , మజిలీ, లవ్ స్టోరీ వంటి అద్భుతమైన సినిమాలు చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే ఈసారి పక్కా మాస్ క్యారెక్టర్ ను ట్రై చేస్తున్నాడు చైతూ. దాని కోసం దాదాపు ఏడాదిగా కఫ్టపడుతున్నాడు. 

Also Read:  నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది

naga chaitanya, samantha, konda surekha

ఫీల్డ్ వర్క్ చేస్తున్నాడు. ఆ పాత్రలో తాను పరకాయ ప్రవేశం చేసి.. ఉత్సాహంగా నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. మత్యకారుల జీవిత కథతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను  ఆకట్టుకుంది. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న తండేల్ రిలీజ్ అయ్యి.. చైతూ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్తుందన్న నమ్మకం టీమ్ లో ఉంది. ఈసినిమా కోసం చై అంతలా కష్టపడ్డాడు మరి. 
ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య చేయబోయే సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read: 

తండేల్ సినిమా తర్వాత నాగ చైతన్య ఓ సింపుల్ లవ్ స్టోరీ చేయనున్నాడని తెలుస్తోంది. అదికూడా తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో మరోసారి నాగ చైతన్య సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సినిమా మజిలీ. ఈ సినిమా కాంబినేషన్ మరోసారి కలబోతోందట. 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారట టీమ్. జాన్వీ కూడా ఈసినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మరి ఈవార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఇప్పటికే నాగ చైతన్య కోసం శివ ఓ అందమైన ప్రేమకథను సిద్ధం కూడా చేశాడట. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Latest Videos

click me!