శోభిత ధూళిపాళ్ల-నాగ చైతన్య పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వైజాగ్ వేదికగా పెళ్లి జరగనుంది. శోభిత ఇంట్లో పెళ్లి సాంప్రదాయాలు మొదలయ్యాయి. పసుపు వేడుక ఫోటోలు శోభిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాగ చైతన్య-శోభిత ఏడడుగుల బంధంతో ఒక్కటి కానున్నారు.
మరోవైపు సమంత పై ఎఫైర్ రూమర్స్ రావడం విశేషం. దర్శకుడు రాజ్ నిడిమోరు-సమంత డేటింగ్ చేస్తున్నారు అనేది వాదన ఇటీవల తెరపైకి వచ్చింది. బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లు తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు.