ఒలింపిక్స్ లో సెక్స్ ప్రదర్శనలు ఎందుకు? కంగనా రనౌత్ ఫైర్

First Published | Jul 27, 2024, 3:06 PM IST

 నేను హోమో సెక్సువాలిటీకి వ్యతిరేకం కాదు కానీ ...ఒలింపిక్స్ కు సెక్సువాలిటీ కు ఏమిటి సంభందం?  


ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు(Paris Olympics 2024) అధికారికంగా గత రాత్రి ప్రారంభమయ్యిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచీ అత్యుత్తమ క్రీడాకారులందరూ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పారిస్‌ మహానగరానికి వచ్చారు. అయితే  ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అనేక  కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం వివాదానికి దారి తీస్తున్నాయి.  ముఖ్యంగా నటి మరియు రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకను "ది లాస్ట్ సప్పర్ యొక్క దైవదూషణ" గా విమర్శించారు. 
 

kangana ranaut


సినీరంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా రనౌత్ (Kangana Ranaut) హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు.  ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ప్యారిస్ ప్రారంభ వేడుకకు సంభందించిన వీడియాలను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు .వాటిలో డ్రాగ్ క్వీన్స్‌చే "ది లాస్ట్ సప్పర్(the Last Supper)"ని పునఃసృష్టి చేయడంతో సహా కొన్ని ప్రదర్శనలు వివాదాస్పదమయ్యాయి. 

Latest Videos



 ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల్లో ఇలాంటి ప్రదర్శనలు చేయడం సరికాదని కంగనా అంటున్నారు.  యేసు మాదిరిగా వేషదారణలో ఉన్న ఓ వ్యక్తి అసభ్యంగా నృత్యం చేసిన వీడియో విమర్శలకు దారి తీసింది.   భారీ టేబుల్ ముందు జీసెస్‌తో పాటు అత‌ని 12 మంది శిష్యులు భోజ‌నం చేసిన‌ట్లు ఉన్న డావిన్సీ ఫోటో ఆధారంగా .. ఓపెనింగ్ సెర్మ‌నీలో డ్రాగ్ క్వీన్ క‌ళాకారులు లాస్ట్ స‌ప్ప‌ర్ పేర‌డీ చేశారు. 
 

Kangana Ranaut


క్రైస్త‌వ క‌మ్యూనిటీ ఈ పేర‌డీని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. దీంట్లో 18 మంది క‌ళాకారులు పాల్గొన్నారు. జీసెస్‌తో పాటు అత‌ని శిష్యులు కూర్చిన భోజ‌నం చేస్తున్న‌ట్లుగానే.. ఆ స్టంట్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. అయితే ఓ మ‌హిళ త‌న త‌ల‌కు భారీ వెండి క‌వ‌చాన్ని ధ‌రించి క‌నిపించింది. దీన్ని కంగనా త‌ప్ప‌ప‌డుతున్నారు. లాస్ట్ స‌ప్ప‌ర్ షోలో ఓ చిన్న పిల్ల కూడా ఉన్న‌ది. అయితే ఆ అమ్మాయిని ఎందుకు ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచార‌ని కూడా ఆమె విమ‌ర్శించారు.


అంతేకాకుండా ఒకతన్ని నగ్నంగా ఉంచి బ్లూ పెయింట్ వేసి జీసస్ గా చేసి క్రిష్టియనాలిటిని మాకింగ్ చేస్తున్నారని ఆమె వాపోయారు. ఒలింపిక్స్ 2024ని లెఫ్టిస్ట్ లు పూర్తిగా హైజాక్ చేసారని, ఇది సిగ్గు చేటు అన్నారు. ఇలాంటి వాటితో ఫ్రాన్స్ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్లు అని నిలదీసారు.  సైతాన్ ని ఆహ్వానించటానికా ఈ ఒలింపిక్స్ అన్నారు. 
 


ఒలింపిక్స్ ఓపినింగ్స్ లో ప్రతీ ఒక్కటి హోమో సెక్సువాలిటీకి చెందినట్లే ఉంది. నేను హోమో సెక్సువాలిటీకి వ్యతిరేకం కాదు కానీ ...ఒలింపిక్స్ కు సెక్సువాలిటీ కు ఏమిటి సంభందం?  మానవ శ్రేష్ఠతను సెక్స్ స్వాధీనం చేసుకుంటుందని అని  చెప్పుకోవడానికి అన్ని దేశాల ఆటలు, క్రీడల భాగస్వామ్యం ఎందుకు?? మన బెడ్‌రూమ్‌లలో సెక్స్ ఎందుకు ఉండకూడదు?? అది జాతీయ గుర్తింపుగా ఎందుకు ఉండాలి? ఇది విచిత్రం!!" అని చెప్పుకొచ్చింది. 


మరో ప్రక్క ఈ విషయాన్ని  క్రిస్టియన్లు ఈ అంశంపై తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. దేవుడి విషయంలో ఇలా చేయడమెంటని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. క్రైస్తవ విశ్వాసాన్ని దెయ్యాల మాదిరిగా అపహాస్యం చేయడం బాలేదని మరికొంత మంది అంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కులకు అవమానం జరిగిందని చెబుతున్నారు.

click me!