చూడ్డానికి ఇంత సింపుల్ గా కనిపిస్తున్నా ... ఈమె సంపాదన రూ.47,500 కోట్లు : ఎవరీమె?

First Published Sep 13, 2024, 11:59 PM IST

జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలు, సిఇఒ రాధా వెంబు చెన్నైలోనే అత్యంత సంపన్న మహిళా బిలియనీర్‌గా నిలిచారు.  

రాధా వెంబు సంపద

భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు రాధా వెంబు. ఆమె చెన్నైలోని అత్యంత సంపన్న మహిళా బిలియనీర్ గా గుర్తింపు పొందారు. ఆమె సంపాదన రూ. 47,500 కోట్లు.

రాధా వెంబు సంపద

వ్యక్తిగత జీవితం, విద్యాభ్యాసం

రాధా వెంబు డిసెంబర్ 24, 1972న చెన్నైలో జన్మించారు. ఆమె చెన్నైలోని ప్రతిష్టాత్మక నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటి మద్రాస్ నుండి ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసారు.

Latest Videos


రాధా వెంబు సంపద

జోహో కార్పొరేషన్ 

రాధా వెంబు తన సోదరుడు శ్రీధర్ వెంబుతో కలిసి 1996లో అడ్వెంట్‌నెట్‌ను స్థాపించారు. ఈ కంపెనీ ఇప్పుడు జోహో అనే ప్రముఖ సంస్థగా రూపాంతరం చెందింది. రాధా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఈ ప్రయత్నం చేసారు. అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో రాధా వెంబు అడుగుమోపారు.

చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న జోహో కార్పొరేషన్సా ఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో ప్రపంచ నాయకుడిగా అవతరించింది, ఈ సంస్థ ఆదాయం రూ. 8,703 కోట్లుగా అంచనా వేయబడింది.

రాధా వెంబు సంపద

వృత్తిపరమైన విజయాలు

ప్రస్తుతం, రాధా వెంబు జోహోకి సహ వ్యవస్థాపకురాలిగానే కాకుండా కంపెనీకి ప్రధాన కార్యనిర్వహణాధికారి (సిఇవో)గా కూడా పనిచేస్తున్నారు. కంపనీని నడపడంలో, దాని ప్రపంచ స్థాయికి విస్తరించడంలో, క్లౌడ్-బేస్డ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో దాని స్థానాన్ని బలోపేతం చేయడంలో ఆమె నాయకత్వం కీలక పాత్ర పోషించింది.

జోహోతో పాటు రాధా వెంబు రియల్ ఎస్టేట్ సంస్థ అయిన హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్,  ప్రభుత్వేతర వ్యవసాయ సంస్థ అయిన జానకి హై-టెక్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌లలో డైరెక్టర్‌షిప్‌లను కలిగి ఉన్నారు. పురుషాధిక్య వ్యాపార రంగంలో మహిళలు వున్న అడ్డంకులను బద్దలుగొడుతూ  రాధా వెంబు విజయం సాధించారు.

రాధా వెంబు సంపద

ఐఐటి గ్రాడ్యుయేట్ నుండి సాఫ్ట్‌వేర్ పరిశ్రమ స్థాపన, విజయవంతంగా నడిపించడం వరకు ఆమె ప్రయాణం అద్భుతం. ఏ రంగంలో అయినా మహిళలు విజయం సాధించగలరని రాాధా వెంబు నిరూపించారు. దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు ఈమె ఆశాకిరణంగా నిలిచారు.  

click me!