ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. అందులో ఎవరు ఎలా ఉంటారో చెప్పడం కష్టం.. ఎంత మంచివారైనా.. వారికి కొన్ని అలవాట్లు తప్పదు. కల్చర్ అలా ఉంటుంది కాబట్టి.. పార్టీలు, పబ్ లు, మందు, సిగరేట్ లాంటివి చాలామందికి అలవాటు ఉంటుంది.
కొంత మంది గుట్టుగా ఉంటారు.మరికొంత మంది మాత్రం రచ్చ రచ్చ చేసుకుని.. ఆస్తులు కూడా పొగోట్టుకుని రోడ్డున పడుతుంటారు. అలా స్టార్లుగా వెలుగు వెలిగి.. చివరకు రోడ్డున పడ్డా నటీనటులు చాలామందిని ఇండస్ట్రీ చూసింది.
అయితే కొంత మంది యాక్టర్లు మాత్రం కెరీర్ బిగినింగ్ నుంచి చాలా జాగ్రత్తగా లైఫ్ ను లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఏమాత్రం లూజ్ ఇవ్వకుండా ఏదైనా లిమిట్ గా చేసుకుంటూ ఉంటుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పచ్చి తాగుబోతులు ఉన్నారు. అసలు ఆల్కాహాల్ ముట్టుకోనివారు కూడా ఉన్నారు.