ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్టు.. మతిపోయే రేటుకు ఓవర్ సీస్ రైట్స్, ఇంత రేటా?

First Published | Oct 15, 2024, 7:37 PM IST

 కల్కికి, దేవరకు థాంక్స్ చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ నెక్ట్స్  ప్రాజెక్టు ఓవర్ సీస్ రైట్స్ అయితే షాకింగ్ రైట్స్ కు వెళ్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏది...ఎంతకు కోట్ చేస్తు

Prabhas, Hanu Raghavapudi, KALKI

మార్కెట్ కు మళ్లీ ఊపొచ్చింది. ప్రభాస్ కల్కి Kalki 2898 AD చిత్రం భాక్సాఫీస్ దగ్గర ఊహకు అందని విధంగా షేక్ చేసింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ సినిమా కొన్న వాళ్లకు సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది. అదే పరిస్దితి దేవరకు కూడా ఏర్పడింది. దాంతో ఇప్పుడు ప్రతీ పెద్ద సినిమా ఓవర్ సీస్ రైట్స్ కు భారీ పోటీ ఏర్పడింది.

బేరసారాలు, రేట్లు తగ్గింపు అడిగినా పోటీపడి మరీ ఓవర్ సీస్ లో రైట్స్ కు ముందుకు వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇది నిర్మాతలకు వరంగా మారింది. వాళ్లు కల్కికి, దేవరకు థాంక్స్ చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ నెక్ట్స్  ప్రాజెక్టు ఓవర్ సీస్ రైట్స్ అయితే షాకింగ్ రైట్స్ కు వెళ్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏది...ఎంతకు కోట్ చేస్తున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Prabhas, Hanu Raghavapudi, KALKI

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన  మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ కు ముందు..“కల్కి 2898 AD “ నిలిచింది.  ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించటం తో మరింత క్రేజ్ క్రియేట్ అయ్యింది.

అందులోనూ ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు. మొదటి రోజు అలా ఉంది..ఇలా ఉంది..ప్రభాస్ పాత్ర సరిగ్గా లేదు వంటి మాటలు వినపడినా దుమ్ము దులిపేసింది. 


Prabhas, Hanu Raghavapudi, KALKI

ఓవర్ సీస్ లో ...రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరిస్ సినిమాల తర్వాత ‘సాహో’తో నార్త్ లో సత్తా చూపెట్టాడు. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ ఫ్లాప్ తో ప్రభాస్ పని అయిపోయిందన్న వాళ్లకు ఆదిపురుష్ ఊతం ఇచ్చింది. అయితే  సలార్ మూవీ తో తనేంటో చెప్పకనే చెప్పాడు.లాస్ట్ ఇయర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 ది సీజ్ ఫైర్’ తో హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  తాజాగా ‘కల్కి 2898ఏడి’ మూవీ ఓవర్ సీస్  వసూళ్లతో దుమ్ము దులిపాడు.   ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా $6 మిలియన్స్ డాలర్స్ తో  మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.   ఈ సినిమా $18 మిలియన్ డాలర్స్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2 తర్వాత నార్త్ అమెరికాలో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమా మరేది లేదు. అంతేకాదు ఈ సినిమా బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా కూడా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం విశేషం.  

Bollywood, Conspiracy, Prabhas

ఇక  దేవర ఓవర్ సీస్ బిజినెస్  27 కోట్లకి క్లోజ్ అయ్యింది. రీజినల్ సినిమా స్థాయిలో చూసుకుంటే గత తెలుగు సినిమాలు కన్నా ఆ ఫిగర్ హయ్యెస్ట్ అని చెప్పవచ్చు. సినిమా రిలీజ్ కు ముందు రికవరీలు ఎలా ఉంటాయో అనుకున్నారు.

అయితే   ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్  దృష్ట్యా అంత పెద్ద మొత్తం  ఓవర్ సీస్ లో రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలకి అర్దమైంది . దేవర సినిమా దసరా సీజన్ లో ఓవర్ సీస్ లో ఓ రేంజిలో కలెక్షన్స్ వర్షం కురిపించింది.  ఇవి చూసాక ఓవర్ సీస్ బయ్యర్లు తమ మార్కెట్ ని మరోసారి సమీక్షించుకుని భారీ రేట్లతో తెలుగు పెద్ద సినిమాలు కొనటానికి ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ సినిమా ఆఫీస్ లలో ఉంటూ డీల్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.

Bollywood, Conspiracy, Prabhas

ఇక ఇప్పుడు అందరి దృష్టీ  ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రానున్న సినిమాపై పడింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ఓవర్ సీస్ రైట్స్ నిమిత్తం Rs. 80 to 100 కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం. దుబాయి నుంచి వచ్చిన  వారు భారీ రేట్లు ఇవ్వటానికి సిద్దపడుతున్నారు. అలాగే అడ్వాన్స్ లు ఇచ్చి మరీ ప్రాజెక్టు లాక్ చేసుకుని ఎగ్రిమెంట్ చేసుకునే హడావిడిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రేటు కనుక నిజమే అయితే ఓవర్ సీస్ రైట్స్ లో ఇదో కొత్త అధ్యాయం అనే చెప్పాలి.

Prabhas

ప్రస్తుతం ప్రభాస్ దృష్టి మొత్తం  హను రాఘవపూడి    ప్రాజెక్ట్ మీదే ఉంది.  సీతారామం తరువాత ప్రభాస్ కోసం కథ రాసుకున్న కథ ఇది.  మైత్రీ వాళ్లు ప్రభాస్‌ను లైన్‌లోకి తీసుకొచ్చారు. ఇది స్వతంత్ర పోరాట కాలం, రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో రాబోతోందని చెప్పేసిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలు జరిగిన రోజు ఓ పోస్టర్‌ను కూడా వదిలారు.

అందులో చాలానే హింట్లు ఇచ్చారు. ఇక అందులో ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా కనిపించింది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ కూడా వచ్చింది.తమిళనాడులోని కారైకుడిలో ఈ షూట్ జరుగుతుందట. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్, నాటి రోజుల్ని తలపించేలా సెట్స్ కూడా వేస్తున్నారని టాక్.

Latest Videos

click me!