Sai Pallavi
సాయి పల్లవి సహజమైన యాక్టింగ్‌తో మెప్పిస్తుంది. అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్ చేస్తుంది. ఎలాంటి పాత్ర అయిన అవలీలగా చేయగలదు. అందుకే ఆమె తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు వ్యక్తిగతంగానూ ఆమె చాలా గొప్ప మనస్తత్వం కలిగి ఉంది. దీంతో ఫ్యాన్స్ ఆమెని ఎంతగానో ఆరాధిస్తారు. ఆమెని ఫాలో అవుతుంటారు. హీరోయిన్లలో ఆమెకి మించిన క్రేజ్ మరెవ్వరికీ లేదని చెప్పొచ్చు. స్టేజ్‌పైకి సాయిపల్లవి వచ్చిందంటే ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిస్తుంటారు. ఇది చూసే దర్శకుడు సుకుమార్ లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చేశాడు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
actress sai pallavi
సాయిపల్లవి ప్రారంభం నుంచి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. తన పాత్రకు ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేసింది. అందుకే ఆమె ఇప్పటి వరకు తెలుగులో ఐదారు మూవీస్ మాత్రమే చేయడం విశేషం. `ఫిదా`, `ఎంసీఏ`, `లవ్ స్టోరీ`, `విరాటపర్వం`, `పడి పడి లేచే మనసు`, `శ్యామ్ సింగరాయ్` సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె `తండేల్` మూవీలో నటిస్తుంది. అయితే సాయిపల్లవితో సినిమాలు చేయాలంటే మేకర్స్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలట. మరి సాయిపల్లవి పెట్టే రూల్ ఏంటి? ఆమెతో సినిమాలు చేయాలంటే ఏం ఫాలో అవ్వాలనేది చూస్తే..
sai pallavi
ఆ కండీషన్స్ అంటే ఆమె మనీ డిమాండ్ కాదు, లగ్జరీ డిమాండ్ కాదు. కంటెంట్ పరమైన డిమాండ్ కావడం విశేషం. తనతో సినిమా అంటే దర్శకులు కొన్ని ఫాలో కావాల్సిందే అంట. అది దర్శక, నిర్మాతలు చేస్తేనే సాయిపల్లవి సినిమా చేస్తుందని అంటున్నారు. ఆమె మొదట తన పాత్రకి ప్రయారిటీ ఇస్తుంది. సినిమాలో తన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించేలా ఉండాలి. అలా అయితేనే ఆమె సినిమా చేస్తుంది.
దీనికితోడు కంటెంట్ బాగుండాలి. తన పాత్ర మాత్రమే కాదు, సినిమా కథకి కూడా ఆమె ప్రయారిటీ ఇస్తుంది. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలే ఒప్పుకుంటుంది. అంతేకాదు సినిమా ప్రారంభానికి ముందే బౌండెడ్ స్క్రిప్ట్ ఉండాలి. అప్పుడే సాయిపల్లవి సినిమా చేయడానికి ఒప్పుకుంటుందట. ఇవన్నీ ఆమె ప్రారంభం నుంచి ఫాలో అవుతుంది.
Sai Pallavi
ఇవన్నీ ఓ ఎత్తైతే లేటెస్ట్ గా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సాయి పల్లవితో సినిమా అంటే ముందుగానే వర్క్ షాప్ కూడా చేయాల్సి ఉంటుందట. వర్క్ షాప్‌లో సీన్లు ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, గెటప్స్, లుక్స్ ఇలా అన్నీ పర్‌ఫెక్ట్ గా ముందుగానే చూసుకోవాలట. అందులో తాను కూడా పాల్గొంటుందట. వర్క్ షాప్‌లో తీయబోయే సీన్లకి సంబంధించి అన్ని రిహార్సల్స్ జరుగుతాయి.
ఇందులో డౌట్స్ కూడా క్లారిటీ వస్తుంది. ఇదంతా సినిమా బాగా రావడం కోసమే. సాయిపల్లవి సినిమా కోసమే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుందట. దీనికి ఒప్పుకుంటేనే ఆ సినిమా చేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది.