ఈరోజుల్లో ఫిల్మ్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. కాస్త డబ్బు ఉంటే చాలు లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, కాస్ట్లీ వస్తువలతో ఎంజాయ్ చేస్తుంటారు. కాని ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంట్లో కార్లు ఉన్నా రెంట్ బైక్ పై వెళ్ళడానికి ఇష్టపడుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె ఎవరో కాదు యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రి.
Also Read: దివ్య భారతి మరణంతో ఆగిపోయిన 10 సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
కోట్లాది రూపాయల ఆస్తులున్నప్పటికీ తృప్తి సింపుల్ గా బైక్ పైనే వెళుతుంటుంది. ముంబయ్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా.. ఆన్ లైన్ లో రెంట్ బైక్ బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి అయిదారేళ్లు అయ్యింది. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఆమె నటించింది, కాని ఆమె గతంలో ఎవరికీ పెద్దగా తెలియదు. ఒక్క సినిమాతో తృప్తి దిమ్రి జీవితం మారిపోయింది. ఒక్క సినిమా ఆమెను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది.
Also Read: 24 ఏళ్ళ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్న చిరంజీవి, విశ్వంభర కోసం మెగాస్టార్ సాహసం చేయబోతున్నారా ?
Tripti Dimri Slays in Black – Fans Can't Keep Calm!
యానిమల్ సినిమా తృప్తి దిమ్రికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈసినిమాలో ఆమె చేసిన బోల్డ్ క్యారెక్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. యానిమల్ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు పెరిగిన డిమాండ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 1 కోటి నుంచి 3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ ను గట్టిగా మార్కెటింగ్ చేసుకుంటుంది కూడా. ఒక్కో ఇన్ స్టా యాడ్ పోస్ట్ కి లక్షల్లో వసూలు చేస్తోందట.
Also Read: పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?
Bad Newz, Animal, Tripti Dimri,
తృప్తి దిమ్రి ఆస్తి ప్రస్తుతం 30 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయినా సరే ఆమె సింపుల్ గానే ఉండడానికే ఇష్టపడుతోందీ. ఇంత క్రేజ్ ఉన్నా.. జనాల్లో ధైర్యంగా తిరిగేస్తోంది తృప్తి. రీసెంట్ గా ఈ హీరోయిన్ బైక్ పై జర్నీ చేస్తూ కనిపించింది. గతంలోనూ పలు సార్లు ఇలాగే బైక్ పైనే జర్నీ చేస్తూ కనిపించింది తృప్తిదిమ్రి. ముంబయ్ లో పెరిగిపోయిన ట్రాఫిక్ వల్ల కార్లలో ప్రయాణం చేయలేకపోతున్నారు సెలబ్రిటీలు. చాలా మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వాడేస్తున్నారు. అందుకేబతృప్తి దిమ్రి కూడా అదే ఫాలో అవుతూ రయ్ మంటూ తిరిగేస్తోంది.