కాలేజీ డ్రాపౌట్స్ అయినా ఈ బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు వందల కోట్లకి అధిపతులు
Bollywood Stars: కొంతమంది బాలీవుడ్ స్టార్లు యాక్టింగ్ కోసం కాలేజీ చదువును వదిలేశారు. ఇప్పుడు వీళ్లంతా కోట్లకు పడగలెత్తారు. వాళ్లెవరో ఇందులో తెలుసుకుందాం.
Bollywood Stars: కొంతమంది బాలీవుడ్ స్టార్లు యాక్టింగ్ కోసం కాలేజీ చదువును వదిలేశారు. ఇప్పుడు వీళ్లంతా కోట్లకు పడగలెత్తారు. వాళ్లెవరో ఇందులో తెలుసుకుందాం.
చాలా మంది బాలీవుడ్ స్టార్లు యాక్టింగ్ కోసం కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశారు. కానీ ఇప్పుడు వీళ్లంతా పెద్ద స్టార్లు, కోట్లకు పడగలెత్తారు. వందల, వేల కోట్లకి అధిపతులుగా రాణిస్తున్నారు. ఇండియన్ సినిమాని శాషిస్తున్నారు.
అక్షయ్ కుమార్ గురు నానక్ ఖల్సా కాలేజీలో చేరాడు. కానీ ఇష్టం లేక చదువు మధ్యలోనే ఆపేశాడు. సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గర రూ.2500 కోట్లు ఉన్నాయి.
ప్రియాంక చోప్రా 12వ తరగతి తర్వాత ముంబైలోని జై హింద్ కాలేజీలో చేరింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత చదువును వదిలి మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. అట్నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఆమె దగ్గర రూ.650 కోట్లు ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరాడు. సినిమాల్లో నటించే అవకాశం రావడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్. ఆయన దగ్గర రూ.2900 కోట్ల ఆస్తి ఉంది.
ఆమిర్ ఖాన్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు. కాలేజీలో చేరిన తర్వాత చదువును మధ్యలోనే ఆపేశాడు. మీడియా కథనాల ప్రకారం ఆమిర్ ఖాన్ వద్ద మొత్తం రూ.1862 కోట్ల ఆస్తులున్నాయట.
దీపికా పదుకొణె బాలీవుడ్‌లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో చదివారు. మోడలింగ్‌పై దృష్టి పెట్టడానికి చదువును మధ్యలోనే ఆపేశారు. హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికా దగ్గర రూ.500 కోట్ల ఆస్తి ఉందని సమాచారం.
రణబీర్ కపూర్ స్కూల్ డ్రాపౌట్. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. యాక్టింగ్ కోసం చదువును వదిలేశాడు. ఆయన దగ్గర రూ.345 కోట్లు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతాయి.
కంగనా రనౌత్ డాక్టర్ కావాలనుకుంది. 12వ తరగతిలో కెమిస్ట్రీ పరీక్షలో ఫెయిల్ కావడంతో చదువును వదిలేయాలని నిర్ణయించుకుంది. ఆమె యాక్టింగ్, మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. ఆమె దగ్గర రూ.91 కోట్ల ఆస్తి ఉందని టాక్.
read more: విజయశాంతిపై మనసు పడ్డ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా? లేడీ సూపర్‌స్టార్ చేసిన పనికి మైండ్ బ్లాక్