నటి సూర్యకాంతంని పట్టుకుని రోడ్డుపైనే చెడా మడా వాయించిన మహిళ.. ఇంకా ఎన్ని కాపురాలు కూలుస్తావంటూ రచ్చ
SuryaKantham: తెలుగు తెరపై గయ్యాలి పాత్రలకు కేరాఫ్ నటి సూర్యకాంతం. ఆమెని ఓ మహిళ నిజంగానే తిట్టిందట. రోడ్డుపై మొహం పట్టుకుని చెడా మడా వాయించిందట.
SuryaKantham: తెలుగు తెరపై గయ్యాలి పాత్రలకు కేరాఫ్ నటి సూర్యకాంతం. ఆమెని ఓ మహిళ నిజంగానే తిట్టిందట. రోడ్డుపై మొహం పట్టుకుని చెడా మడా వాయించిందట.
SuryaKantham: సూర్యకాంతం.. తెలుగు సినిమాలో ఈ పేరు చెబితే గయ్యాలి పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆమె గయ్యాలి అత్తగా వెండితెరపై చేసిన రచ్చ వేరే లెవల్. నిజంగానే గయ్యాలి అత్తా ఇలానే ఉంటుందనేలా, ఇంకా చెప్పాలంటే, వాళ్లని మించిపోయేలా తనదైన నటనతో పాత్రని రక్తికట్టిస్తూ మెప్పించింది. నిజంగానే గయ్యాలి అత్తగా పాపులర్ అయ్యింది.
లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాని ఓ ఊపు ఊపేసిన నటి సూర్యకాంతం. సాధారణంగా సినిమాల్లో హీరోహీరోయిన్లు, విలన్లు ఉన్నాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. కానీ ఆయా పాత్రలకు వన్నె తెచ్చిన నటి సూర్యకాంతం కావడం విశేషం.
పాత్రలో జీవించి నిజంగానే ఆమె ఇంత గయ్యాలిదా అని ఆడియెన్స్ చేత అనిపించుకున్న నటి కూడా ఆమెనే. సినిమాల్లో ఆమె పాత్ర చేసే గయ్యాలి తనం నచ్చని ఆడియెన్స్ రియల్ లైఫ్‌లోనూ ఆమెని అంతగా అసహ్యించుకున్నారంటే సూర్యకాంతం ఏ రేంజ్ లో పర్‌ఫెర్మెన్స్ ఇచ్చిందో ఊహించుకోవచ్చు.
ఓ మహిళ నిజంగానే సూర్యకాంతంని పట్టుకుని తిట్టిందట. ఏం జరిగిందనేది చూస్తే, ఓ సారి సూర్యకాంతం మద్రాస్ నుంచి నెల్లూరు కారులో వెళ్తుందట. దారిలో ఓ చోట కారు ట్రబులిచ్చి ఆగిపోయిందట. డ్రైవర్ కారుని రిపేర్ చేసేపనిలో ఉన్నారు.
దీంతో సూర్యకాంతం కారు నుంచి దిగి రోడ్డుపై అటు ఇటు నడిచిందట. ఇంతలో అటునుంచే ఓ రిక్షా వెళ్లింది. కొద్ది దూరం వెళ్లి ఆ రిక్షా ఆగింది. అందులో నుంచి ఓ యాభై ఏళ్ల మహిళ సూర్యకాంతం వద్దకు నడుచుకుంటూ వచ్చింది.
రావడం రావడంతోనే ఆమె కోపంతో ఊగిపోతుందట. `ఏవమ్మా నీకు ఇదేం మాయ రోగం, ఇలా ఎన్ని కాపురాలు కూలుస్తావ్. ఎంత మంది ఆడపడుచుల ఊసురుపోసుకుంటావ్` అంటూ తిట్లదండకం ప్రారంభించిందట. కోపంతో కాసేపు అరిచి వెళ్లిపోయిందట. కాసేపు సూర్యకాంతంకి కూడా ఏం అర్థంకాలేదు.
ఆమె వెళ్లిపోయాక ఆలోచించి నవ్వుకుందట. సినిమాల్లో తన పాత్రని అంతగా ఆమె రిసీవ్ చేసుకుందని, అంతగా ప్రేమించిందని, అందుకే తనపై ద్వేషం పెట్టుకుందని అనుకుని వెళ్లిపోయిందట. అది సూర్యకాంతం నటనలోనూ మ్యాజిక్ అని సినీ విశ్లేషకులు వెల్లడించారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.
also read: ఇంత రేట్ అంటే నీ పెళ్లాం వదిలేసిపోతుంది, `అలేఖ్య చిట్టి పికిల్స్` పై ప్రియదర్శి మాస్ ట్రోలింగ్