మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కు చెప్పడానికి ఎవరైనా ఆలోచిస్తారేమో కాని.. ఆధ్య మాత్రం ఏది ఉన్నా చెప్పేస్తుంది. పవన్ కూడా ఎవరి మాట విన్నా వినకపోయినా..ఆధ్య చెపితే వినాల్సిందే. కొండమీద కోతిని అడిగినా తెచ్చిస్తాను అంటారట పవన్ కళ్యాణ్. ఇంట్లో ఏది చేయాలనన్నా..ఆధ్య మాటమీదనే జరుగుతుందట.
ఈ విషయాన్ని ఎవరో బయటవారు చెప్పలేదు...పవర్ స్టార్ మాజీ భార్య.. ఆద్య అమ్మ రేణు దేశాయ్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ తన పిల్లను, ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ఇవ్వాల్సిన టైమ్ వారికి కేటాయిస్తారు. ఎంత హడావిడి ఉన్నా ప్యామిలీని మాత్రం మర్చిపోరు పవన్.
తన గెలుపు సందర్భంగా అకీరా నందన్ ను వెంటేసుకుని తిరిగారు పవన్. ప్రధాని దగ్గరకు కూడా తన కొడుకుతో పాటు వెళ్ళారు. గెపులు సంతోషాన్ని మెగా ఫ్యామిలీ తో కలిసి చిరు ఇంట సెలబ్రేట్ చేసిన పవన్.. మెగాస్టార్ కు సాష్టాంగ నమస్కారం చేశారు.
Also Read: ముంబయ్ హీరోయిన్ తో సీక్రేట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో నాగార్జున ప్రకటన.