సింహాద్రికి మొత్తం ఫ్లాప్ సాంగ్స్ ఇచ్చా..రమ్యకృష్ణ ఐటెం సాంగ్ అసలు గుట్టు విప్పి మైండ్ బ్లాక్ చేసిన కీరవాణి

First Published | Nov 27, 2024, 12:02 PM IST

టాలీవుడ్ లో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో కీరవాణి ఒకరు. 1990 నుంచి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఆయనకి సీతారామయ్య గారి మనవరాలు, ఘరానా మొగుడు, క్షణక్షణం లాంటి చిత్రాలు అద్భుతమైన గుర్తింపు తీసుకువచ్చాయి. 

టాలీవుడ్ లో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో కీరవాణి ఒకరు. 1990 నుంచి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఆయనకి సీతారామయ్య గారి మనవరాలు, ఘరానా మొగుడు, క్షణక్షణం లాంటి చిత్రాలు అద్భుతమైన గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ తర్వాత కీరవాణి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే.. ఇది ఫిక్స్. 

స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. త్వరలో మొదలు కాబోతున్న మహేష్ చిత్రానికి కూడా ఆయనే సంగీత దర్శకుడు. తనకి, రాజమౌళికి బాగా సింక్ కుదిరింది అని అందుకే తమ కాంబినేషన్ వర్కౌట్ అవుతోంది అని తెలిపారు. అయితే ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తో జరిగిన చిట్ చాట్ లో కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


తన చిత్రాల్లో హిట్ అయిన సినిమా పాటలు పొగిడే వారికంటే ఫ్లాప్ మూవీ పాటలు బావున్నాయి అని చెప్పే వారే తనకి ఇష్టం అని కీరవాణి అన్నారు. రాజమౌళిని ఉదాహరణగా చెబుతూ సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ఒక నిజం చెప్పాలి.. సింహాద్రి చిత్రానికి నేను మొత్తం ఫ్లాప్ సాంగ్స్ ఇచ్చాను. 

నా పాట చిత్రాల్లోని ఫ్లాప్ సాంగ్స్ ని రాజమౌళికి వినిపించా. సింహాద్రి చిత్రానికి అవే పాటలు కావాల అని అన్నాడు. అవి ఫ్లాప్ కదా అని అన్నాను. లేదు నేను ఆ సాంగ్స్ నే స్క్రీన్ పై బాగా ప్రెజెంట్ చేస్తాను అని చెప్పా. ఆ విధంగా కొన్ని చిత్రాల్లోని ఫ్లాప్ సాంగ్స్ ని కాపీ కొట్టి కాస్త మార్చి సింహాద్రి చిత్రాన్ని ఇచ్చాను. వాటినే రాజమౌళి చిత్రీకరించారు. 

సింహాద్రి చిత్రంలో రమ్యకృష్ణ 'చీకులమ్మే చిన్నది కావాలా' అనే ఐటెం సాంగ్ చేశారు. ఆ ఐటెం సాంగ్ అసలు గుట్టు విప్పారు కీరవాణి. వినోద్, ఊహ జంటగా నటించిన సమర్పణ చిత్రం 1992లో విడుదలయింది. ఆ చిత్రంలో చీకులమ్మే సాంగ్ ఉంది. ఆ పాటనే కాస్త రీమిక్స్ చేసి ఇచ్చాను అని తెలిపారు. ఇది నిజంగా షాకింగ్ విషయమే.  

Latest Videos

click me!