రియా అరెస్ట్: ఎన్సీబీ అంటే ఏమిటి? ఆమెకు ఎటువంటి శిక్ష పడొచ్చు ..?

First Published Sep 9, 2020, 4:35 PM IST

రియాను అరెస్ట్ చేసింది పోలీసు వారు కాదు. ఎన్సీబీ వారు. దీనితో అసలు ఈ ఎన్సీబీ అంటే ఏమిటి? వారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు, వారికి, రాష్ట్ర పోలీసులకు మధ్య తేడా ఏమిటి వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వివరాలు మీకోసం 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై చెలరేగిన దుమారం ఇప్పుడప్పుడు చల్లారేదిలా కనబడడం లేదు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని నిన్న నార్కోటిక్స్ బ్యూరో వారు అరెస్ట్ చేసారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించిన డ్రగ్స్ కేసులో రియాకు 14 రోజుల రేమండ్ ను విధించింది కోర్టు.
undefined
ప్రస్తుతం రియా బైకుల్లా జైలులో ఉంది. ఇదే కేసులో గతంలో రియా సోదరుడు షోవిక్, సుశాంత్ దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సామ్యూల్, దీపేష్ సావాన్త్ లను కూడా అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులకు కూడా జరగవచ్చు అనే వార్త వినబడుతుంది.
undefined
నిన్న రియా అరెస్ట్ అయిన దగ్గరి నుండి రియాను అరెస్ట్ చేసింది పోలీసు వారు కాదు. ఎన్సీబీ వారు. దీనితో అసలు ఈ ఎన్సీబీ అంటే ఏమిటి? వారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు, వారికి, రాష్ట్ర పోలీసులకు మధ్య తేడా ఏమిటి వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వివరాలు మీకోసం
undefined
ఎన్సీబీ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖా కిందకు వస్తుంది ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మత్తుపదార్థాల తయారీ, సరఫరా, రవాణాను అడ్డుకోవడం ఎన్సీబీ ప్రధాన పని. మార్చ్ 17, 1986లో నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సుబ్స్టెన్స్స్ ఆక్ట్ ను పూర్తి స్థాయిలో అమలు పర్చడానికి ఈ శాఖను ఏర్పాటు చేసారు.
undefined
ఈ ఎన్సీబీ కి హెడ్ గా వ్యవహరించే డైరెక్టర్ ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్అధికారి అయి ఉంటారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఇది రాదు. రియాను నార్కోటిక్స్ చట్టంలోనిసెక్షన్ 8 (c), 27 (a), 28 & 29 ల కింద అరెస్ట్ చేసారు.
undefined
సెక్షన్ 8(సి) ప్రకారం మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, లేదా, వాటిని అక్రమంగా తరలించడం, తెప్పించుకోవటం, అంతర్ రాష్ట్ర సరిహద్దులను ధనాటించడంఇతరాత్రాలు అన్ని నిషిద్ధం. ఈ సెక్షన్ ప్రకారం మత్తు పదార్థాలను వినియోగించిన కూడా నేరమే. దీనికి గాను 10 సంవత్సరాలకు తక్కువకాకుండా కఠిన కారాగారశిక్ష తో పాటుగా 10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించేఆస్కారం ఉంది.
undefined
సెక్షన్ 20(బి) కూడా ఇంచుమించు ఇదే విషయాన్నీ చెబుతుంది.క్యానబీస్( గంజాయి) ఉత్పత్తి, తయారీ రవాణా, కలిగిస్తో ఉండడం అన్ని కూడా శిక్షార్హమైనవి. ఇందుకు గాను 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.
undefined
ఇక సెక్షన్ 27(ఏ) మాదకద్రవ్యాల జీవనానికి సంబంధించింది. ఎటువంటి నార్కోటిక్ డ్రగ్ ని వాడినా అందుకు సంబంధించిన శిక్షను ఈ సెక్షన్ లో పొందుపరిచారు. వాడినందుకుగాను 20 వేల వరకు జరిమానా, సంవత్సరం వరకు జైలు శిక్ష పడే ఆస్కారం ఉంది.
undefined
click me!