కన్నడ స్టార్స్ కు పిచ్చ కోపం తెప్పించిన తెలుగు నటుడి కామెంట్స్ ఇవే

First Published Dec 14, 2020, 8:56 AM IST

కన్నడ ప్రముఖ నటుడు విష్ణువర్ధన్‌పై తెలుగు నటుడు విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నటుడు నరేష్‌ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన.... కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. లెజెండరీ నటుడ్ని దూషించడం, అసభ్యపదజాలం వాడటం సరికాదని పేర్కొన్నారు. ఐకమత్యంగా ఉంటూ ఒకర్నొకరం గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. మరో ప్రక్క విజయ రంగరాజు  పై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు యశ్‌, సుదీప్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పించడంతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తను చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల మన్నించమని కోరుతూ మధ్య విజయ రంగరాజు వీడియో విడుదల చేశారు. ఇంతకీ విజయ రంగరాజు ఏమన్నారో చూద్దాం.

పాత తెలుగు సినిమాల్లో ఎక్కువగా నెగిటివ్ క్యారక్టర్స్, ఫైటర్ పాత్రలు చేసిన విజయ్ రంగరాజు..కు చాలా గ్యాప్ వచ్చింది. ఆయన చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఐతే తాజాగా ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో పాత విషయాలు పంచుకుంటూ ట్రెండ్ అవుతున్నారు.
undefined
మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది గురించి ఆయన తన ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. రామిరెడ్డి మరణం గురించి కూడా ఆయన సంచలన విషయాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలు చూస్తే ఆయన బాగా ఔట్ స్పోకెన్ అనిపిస్తోంది. అలాగే జనాల దృష్టిని ఆకర్షించడానికి కూడా ఆయనీ మార్గం ఎంచుకుని ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
undefined
ఇంతకీ ప్రస్తుత వివాదం ఏంటంటే.. కన్నడలో రాజ్ కుమార్ తర్వాత అంతటి దిగ్గజ స్థాయి ఉన్న నటుడు విష్ణువర్ధన్. ఆయన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు విజయ్ రంగరాజు. విష్ణు వర్దన్ కు లేడీస్ వీక్నెస్, మొదట నుంచీ అదే పద్దతిలో ఉండేవాడని అన్నారు.
undefined
విష్ణు వర్దన్ తో తాను ముత్తైద భాగ్య అనే కన్నడ సినిమాలో నటించానని.. తాను సెట్స్ల్ కి వెళ్లినపుడు జయమాలిని నేరుగా వచ్చి తనను ఆలింగనం చేసుకోవడాన్ని ఆయన ఓర్చుకోలేకపోయాడని.. వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరినీ సెట్స్ నుంచి బయటికి పంపమని ఆదేశించాడని విజయ్ రంగరాజు అన్నాడు. విష్ణు వర్దన్ కు ఉన్న లేడీస్ వీక్నెస్ తో తట్టుకోలేక తమను వెళ్లిపొమ్మన్నాడని అన్నారు.
undefined
ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే.. తాను డిస్టర్బ్ అవుతున్నానని చెప్పాడని.. ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ్ రంగరాజు వ్యాఖ్యానించాడు. ఇలా విష్ణు వర్దన్ ని అనటంతో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.
undefined
అంతేకాకుండా ఓ సన్నివేశంలో ఫైట్ మాస్టర్ హార్సమెన్ బాబు...ఉన్నప్పుడు విష్ణు వర్దన్ తో గాజు గ్లాస్ పగలకొట్టే సీన్ ఉందని, అయితే విష్ణు వర్దన్ పద్దతి ముందే తెలిసి..తాను తప్పుకున్నానని అన్నారు. ఆ తర్వాత వేరే ఫైటర్ కు అదే సెటప్ పెడితే విష్ణు వర్దన్..వెళ్లి భుజం మీద కొట్టాల్సిన అద్దాన్ని తలపై కొట్టారని, ఆ ఫైటర్ చేపలా గిల గిలా కొట్టుకున్నాడని,తనకు బాధ కలిగిందని చెప్పారు. దాంతో ఆ కోపంలో విష్ణు వర్దన్ కాలర్‌ పట్టుకున్నానని, చెడామడా తిట్టేశానని విజయ్‌ అన్నారు. రంగరాజు చేసిన వ్యాఖ్యలు కన్నడనాట దుమారం రేపాయి.
undefined
ఈ విషయమై నరేష్ మాట్లాడుతూ...‘మన నటుడు విజయ రంగరాజు కన్నడ ఆరాధ్య దైవం, దివంగత నటుడు విష్ణువర్ధన్‌ను ఏక వచనంతో, అనకూడని మాటలు అన్నారు. నటుడిగా నన్ను ఇది ఎంతో బాధించింది. కోట్లాది ప్రజల అభిమానం పొందిన ఓ కళాకారుడి గురించి అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలా జరిగినందుకు బాధపడుతున్నా అన్నారు.
undefined
ఇవి విజయ రంగరాజు వ్యక్తిగత ఆలోచనలు అయినప్పటికీ మాట్లాడిన, చెప్పిన తీరు చాలా తప్పు. నేను విష్ణువర్ధన్‌ని చిన్నతనం నుంచి చూసి, అభిమానించి పెరిగా. ఇటువంటివి మళ్లీ జరగకూడదని ప్రార్థిస్తున్నా. విజయరంగరాజుతో నేను మాట్లాడతాను’ అని నరేష్‌ చెప్పారు.
undefined
ఆయన వ్యాఖ్యలపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు యశ్‌, సుదీప్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పించడంతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.
undefined
విజయ్‌ రంగరాజు తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భూమిపైలేని వ్యక్తి గురించి కామెంట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సుదీప్‌ వీడియో విడుదల చేశారు.
undefined
ఈ వివాదంపై పునీత్‌ రాజ్‌కుమార్‌, యశ్ స్పందిస్తూ కన్నడంలో ట్వీట్లు చేశారు. ప్రాంతంతో సంబంధం లేకుండా మనతో పనిచేసే తోటి ఆర్టిస్టుల్ని గౌరవించడం ఓ ఆర్టిస్టుకు ఉండాల్సిన ముఖ్య లక్షణమని పునీత్‌ పేర్కొన్నారు.
undefined
కన్నడ ప్రముఖ నటుడు విష్ణువర్ధన్‌ను అవమానిస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దీనికి విజయ్‌ రంగరాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్టిస్టు సేవలను గౌరవించడంలో మొత్తం చిత్ర పరిశ్రమ ఐకమత్యంగా ఉంటుందని తెలిపారు. మనమంతా మునుషుల్లా ఉందామని పునీత్‌ పేర్కొన్నారు.
undefined
విజయ్‌ రంగరాజుపై తగిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్‌ అల్లుడు అనిరుద్ధ జట్కర్‌ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుల్ని కోరారు. అంతేకాదు కన్నడ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఆయనపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ రంగరాజు కన్నీరుమున్నీరయ్యారు. పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేశానని క్షమాపణలు చెప్పారు.
undefined
‘మీ కాళ్లు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి.. విష్ణువర్ధన్‌ అభిమానులకు క్షమాపణలు తెలుపుతున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేసుండకూడదు.. కానీ చేశాను. నన్ను మన్నించండి. సుదీప్‌, పునీత్‌, ఉపేంద్ర.. నన్ను క్షమించండి’ అని కంటతడి పెట్టుకున్నారు.
undefined
రంగరాజు విషయానికి వస్తే.. ఆయన ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించాడు. విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ స్వతహాగా క్రీడాకారుడు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది. విజయ రంగరాజు 1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గోపీచంద్ యజ్ఞం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
undefined
click me!