2005లో విడుదలై మంచి ఆదరణ పొందిన విజయ్ సచిన్ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. తాను వి క్రియేషన్స్ బ్యానర్‌పై జాన్ మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా, 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 18న రీ-రిలీజ్ కానుంది. విజయ్ సరసన జెనీలియా నటించింది. వడివేలు కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.
అయితే ఈ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్ వార్ కామన్ గా జరిగేది. ఇక రీరిలీజ్ ల టైమ్ లో కూడా ఇద్దరు హీరోల ప్యాన్స్ సోసల్ మీడియా వార్ జరుగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శించుకోవడం.. హీరోలను కూడా విమర్శించడం జరిగింది. అటు అజిత్ మాత్రం తన అభిమాన సంఘాలను ఎప్పుడో రద్దు చేశారు.