వీడికంటే అందగాడివా.. వివరాలు అడిగిమరీ నడిరోడ్డులో చిరంజీవిని అవమానించిన వ్యక్తి

Published : Apr 16, 2025, 05:56 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో రాణించేందుకు చిరంజీవి చెన్నై వెళ్లారు. అవకాశాల కోసం చిరు చేయని ప్రయత్నం అంటూ లేదు.

PREV
14
వీడికంటే అందగాడివా.. వివరాలు అడిగిమరీ నడిరోడ్డులో చిరంజీవిని అవమానించిన వ్యక్తి
megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో రాణించేందుకు చిరంజీవి చెన్నై వెళ్లారు. అవకాశాల కోసం చిరు చేయని ప్రయత్నం అంటూ లేదు. చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్సులో కూడా చేరారు. అక్కడ తనకి ఎదురైన అవమానాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. 

24
megastar chiranjeevi

ఫిలిం ఇన్స్టిట్యూట్ దగ్గర్లో పాండి బజార్ ఉండేది. అందరూ అక్కడికి సాయంత్రం వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్న వారంతా దాదాపుగా సినిమా రంగంలో రాణించాలని వచ్చినవాళ్లే. చిరంజీవి ఒక సాయంత్రం అక్కడికి వెళ్లారట. ఒక వ్యక్తి చిరంజీవిని పిలిచి ఏంటి.. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యావా ? హీరో అయిపోదామనే అంటూ వెకిలి నవ్వు నవ్వాడు. తన పక్కన ఉన్న వ్యక్తిని చూపిస్తూ.. వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో.. చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. వాడికే ఛాన్సులు రావడం లేదు. వీడికంటే అందగాడివా నువ్వు అని ఎగతాళి చేశారు. 

34

అంతటితో ఆగలేదు. ఎవరైనా ఇండస్ట్రీలో తెలిసినవాళ్ళు ఉన్నారా అని అడిగారు.. లేదు అని చెప్పా. కులం ఏంటి అని అడిగారు.. నా కులం చెప్పాను. ఆహా.. అయితే అన్ని సర్దుకుని వెళ్ళిపో. ఇక్కడ నువ్వు సర్వైవ్ కావడం కష్టం అని అన్నారు. అతను అలా మాట్లాడడంతో చాలా బాధపడ్డాను, ఏంటి నేను ఇక్కడ రాణించలేనా అనే అనుమానం మొదలైంది. వెంటనే నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని తలుచుకుని ధైర్యం తెచ్చుకునేవాడిని. 

44

ఆ సంఘటన తర్వాత ఇంకెప్పుడూ తాను పాండీ బజార్ వైపు వెళ్ళలేదు అని చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత చిరంజీవికి పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు లాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రాణం ఖరీదు ముందుగా విడుదలయింది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. డ్యాన్స్ లో తన ప్రతిభ చూపిస్తూ చిరంజీవి ఇండస్ట్రీ దృష్టిలో పడ్డారు. ఖైదీ చిత్రంతో సరికొత్త స్టార్ గా అవతరించారు. 

Read more Photos on
click me!

Recommended Stories