పెళ్లి తర్వాత నటుడు విజయ్ దేవరకొండ, తన భార్య రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి తన సొంతూరు తుమ్మన్‌పేటకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి విద్యార్థులకు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు.
26
స్కాలర్‌షిప్‌ల పంపిణీ
విజయ్-రష్మిక దంపతులు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంచుతున్నారు. ఈ ఏడాది మొదట్లో పెళ్లి కాగానే విజయ్ తన సొంతూరు తుమ్మన్‌పేటకు వెళ్లినప్పుడు ఈ హామీ ఇచ్చారు.
36
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా
ఆ పర్యటనలో, అచ్చంపేట డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని విజయ్ మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ 'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు.
9, 10వ తరగతులకు చెందిన మొత్తం 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ జంట ఆర్థిక సాయం అందించారు. గురువులు, తల్లిదండ్రుల మాట విని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
56
గ్రామస్థుల ఘన స్వాగతం
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం జూన్ 14న విజయ్ తన భార్య రష్మికతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తన సొంతూరు తుమ్మన్‌పేటకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులు ఈ కొత్త దంపతులకు ఘన స్వాగతం పలికారు.
66
పూర్తి ఖర్చులు భరిస్తామని హామీ
అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు 'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా ఉన్నత చదువులకు అవసరమైన పూర్తి ఖర్చులను విజయ్, రష్మిక భరించనున్నారు.